కరోనా పై పోరుకు మేఘా సైతం... రూ. 5కోట్ల విరాళం

కరోనా వైరస్ పై జరుగుతున్న పోరులో భాగంగా ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ మేఘ ఇంజనీరింగ్ తనవంతు బాధ్యత నిర్వర్తిస్తోంది. సామాజిక బాధ్యతలో భాగంగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి 5 కోట్ల రూపాయలు ఆర్ధిక సహాయం అందించిన మేఘ అధినేత పీవీ కృష్ణారెడ్డి , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి 5 కోట్ల రూపాయల విరాళం అందచేసారు. అందులో భాగంగా తాడేపల్లి లో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని కలిసి కృష్ణారెడ్డి 5 కోట్ల రూపాయల చెక్కు […]

Advertisement
Update:2020-03-27 13:53 IST

కరోనా వైరస్ పై జరుగుతున్న పోరులో భాగంగా ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ మేఘ ఇంజనీరింగ్ తనవంతు బాధ్యత నిర్వర్తిస్తోంది.

సామాజిక బాధ్యతలో భాగంగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి 5 కోట్ల రూపాయలు ఆర్ధిక సహాయం అందించిన మేఘ అధినేత పీవీ కృష్ణారెడ్డి , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి 5 కోట్ల రూపాయల విరాళం అందచేసారు. అందులో భాగంగా తాడేపల్లి లో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని కలిసి కృష్ణారెడ్డి 5 కోట్ల రూపాయల చెక్కు అందించారు.

తెలుగు రాష్ట్రాలతో పాటు కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి సహాయనిధికి కూడా 2 కోట్ల రూపాయలు మేఘా ఇంజనీరింగ్ సంస్థ విరాళం అందజేసింది. మేఘా ఇంజనీరింగ్ సంస్థ కర్ణాటక రీజియన్ విభాగం అధిపతి సుధీర్ మోహన్ కర్ణాటక ముఖ్యమంత్రిని కలిసి 2 కోట్ల రూపాయల చెక్కు అందించారు. ఇదే క్రమంలో ఒడిశా ప్రభుత్వానికి మరో కోటి రూపాయల ఆర్ధిక సహాయం అందించింది మేఘ ఇంజనీరింగ్. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని మేఘా సంస్థ ప్రతినిధి రంగరాజన్ కలిసి కోటి రూపాయల చెక్కు అందజేశారు.

త్వరలో మరికొన్ని రాష్ట్రాలకు ఆర్ధిక సహాయం అందజేసేందుకు మేఘా ఇంజనీరింగ్ సంస్థ సిద్దం అవుతోంది.

Tags:    
Advertisement

Similar News