సీరియళ్లపై కరోనా ఎఫెక్ట్‌.... త్వరలోనే ప్రసారాలు బంద్‌

కరోనా ఎఫెక్ట్‌ మెల్లమెల్లగా ప్రారంభమవుతోంది. ఇప్పటికే పలు వ్యాపారాలపై ప్రభావం చూపుతోంది. తాజాగా సీరియళ్లపై పడింది. ఇప్పటికే సినిమా, సీరియల్‌ షూటింగ్‌లు బంద్‌ చేశారు. అటు థియేటర్లు కూడా మూతపడ్డాయి. అయితే ఇప్పుడు సీరియళ్లకు కష్టాలు మొదలయ్యాయి. సినిమా షూటింగ్‌లు నిలిపివేశారు. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత షూటింగ్‌లు మొదలవుతాయని ప్రకటించారు కూడా.  అయితే విడుదలకు సిద్ధమైన సినిమాలకు సమస్య వచ్చింది. వారు కొంత ఆందోళనగా ఉన్నారు. కరోనా వైరస్‌ ప్రభావం తగ్గిన వెంటనే రిలీజ్‌ చేస్తామని […]

Advertisement
Update:2020-03-27 06:20 IST

కరోనా ఎఫెక్ట్‌ మెల్లమెల్లగా ప్రారంభమవుతోంది. ఇప్పటికే పలు వ్యాపారాలపై ప్రభావం చూపుతోంది. తాజాగా సీరియళ్లపై పడింది. ఇప్పటికే సినిమా, సీరియల్‌ షూటింగ్‌లు బంద్‌ చేశారు. అటు థియేటర్లు కూడా మూతపడ్డాయి. అయితే ఇప్పుడు సీరియళ్లకు కష్టాలు మొదలయ్యాయి.

సినిమా షూటింగ్‌లు నిలిపివేశారు. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత షూటింగ్‌లు మొదలవుతాయని ప్రకటించారు కూడా. అయితే విడుదలకు సిద్ధమైన సినిమాలకు సమస్య వచ్చింది. వారు కొంత ఆందోళనగా ఉన్నారు. కరోనా వైరస్‌ ప్రభావం తగ్గిన వెంటనే రిలీజ్‌ చేస్తామని ప్లాన్‌ చేస్తున్నారు. అయితే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా? లేదా? అనే అనుమానాలు వారిలో ఉన్నాయి.

అయితే ఇప్పుడు సీరియళ్లకు కొత్త సమస్య వచ్చి పడింది. జనతాకర్ఫ్యూ తర్వాత ఏకంగా దేశంలో లాక్‌డౌన్‌ ప్రకటించారు. దీంతో ఎక్కడి సీరియళ్ల షూటింగ్‌లు అక్కడే నిలిచిపోయాయి. మామూలుగా వారం, పది రోజులకు గాను ముందుగానే సీరియల్‌ షూటింగ్‌లు జరుగుతాయి. దీంతో ఇప్పటివరకూ కొన్ని సీరియళ్ల ప్రసారం చేశారు. అయితే ఇప్పుడు షూటింగ్‌ చేసిన పార్ట్‌ అయిపోవడంతో… కొన్ని సీరియళ్లను నిలిపి వేస్తున్నట్లు పలు టీవీ యాజమాన్యాలు ప్రకటించాయి. ఈమేరకు టీవీల్లో స్క్రోలింగ్‌లు ప్రసారం చేస్తున్నారు.

ఇటు జెమిని, మాటీవీ దగ్గర ఈవీకెండ్‌తో స్టాక్‌ అయిపోతుందట. దీంతో వారు కూడా సీరియళ్లు నిలిపివేసి సినిమాలు వేసే అవకాశం ఉందని తెలుస్తోంది. లాక్‌డౌన్‌ పొడిగిస్తే…మరికొంతకాలం సీరియళ్లు చూసే భాగ్యం మహిళలకు దొరకదు. మొత్తానికి సినిమా కష్టాలు ఒకలా ఉంటే… సీరియళ్ల కష్టాలు మరొకలా ఉన్నాయి.

Tags:    
Advertisement

Similar News