కరోనా ఎఫెక్ట్ : షహీన్‌భాగ్ ఆందోళనలు ముగింపు

కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని షహీన్‌భాగ్‌లో వందలాది మంది ప్రజలు, కార్యకర్తలు నిరసనలు తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. 100 రోజులకు పైగా ఇక్కడ నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. వీరికి మద్దతుగా దేశవ్యాప్తంగా పలు చోట్ల ర్యాలీలు, ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆందోళనలో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నా…. ఇంత వరకు వారి నిరసనలు మాత్రం ఆపకుండా కొనసాగించారు. కాగా, దేశంలో రోజు రోజుకూ పెరిగిపోతున్న కరోనా మహమ్మారి భయాందోళనతో […]

Advertisement
Update:2020-03-24 04:47 IST

కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని షహీన్‌భాగ్‌లో వందలాది మంది ప్రజలు, కార్యకర్తలు నిరసనలు తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. 100 రోజులకు పైగా ఇక్కడ నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. వీరికి మద్దతుగా దేశవ్యాప్తంగా పలు చోట్ల ర్యాలీలు, ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆందోళనలో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నా…. ఇంత వరకు వారి నిరసనలు మాత్రం ఆపకుండా కొనసాగించారు.

కాగా, దేశంలో రోజు రోజుకూ పెరిగిపోతున్న కరోనా మహమ్మారి భయాందోళనతో షహీన్‌భాగ్ నిరసనలకు తెరపడింది. ఇప్పటికే వైరస్ భయంతో చాలా మంది ఇండ్లకు వెళ్లిపోగా.. కొంత మంది మాత్రం నిరసనలను కొనసాగించారు. కాగా, ఢిల్లీలో లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు అక్కడ నిరసన చేస్తున్న కొంత మందిని బలవంతంగా అరెస్టు చేశారు.

మంగళవారం ఉదయం ఆగ్నేయ ఢిల్లీ పోలీసు డిప్యుటీ కమిషనర్ ఆర్‌పీ మీనా నేతృత్వంలో నిరసన స్థలానికి చేరుకున్న పోలీసులు టెంట్లు, ఇతర సామాగ్రిని బలవంతంగా తొలగించారు. ఈ సమయంలో అడ్డుకున్న ఆరుగురు మహిళలు, ముగ్గురు పురుషులను పోలీసులు అరెస్టు చేశారు.

కరోనా వైరస్ భయాందోళన నేపథ్యంలో ఢిల్లీలో లాక్‌డౌన్ ప్రకటించినందువల్లే షహీన్‌భాగ్ నిరసనకారులను అక్కడి నుంచి పంపేసినట్లు పోలీసులు తెలుపుతున్నారు. ఆ ప్రాంతాన్ని ఢిల్లీ మున్సిపల్ అధికారుల సహాయంతో పూర్తిగా శుభ్రం చేస్తున్నట్లు తెలిపారు. ఢిల్లీలోని ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న నిరసనలను కూడా అడ్డుకొని ఆందోళనకారులను ఇండ్లకు పంపించేశామని తెలిపారు.

Tags:    
Advertisement

Similar News