కరోనాకు మందేంటో చెప్పిన విరుష్క జోడీ

హ్యాండ్ వాష్…కరోనా స్మాష్ అంటున్న సచిన్ ప్రపంచ దేశాలతో పాటు భారత్ ను భయపెడుతున్న కరోనా వైరస్ పై కేంద్ర, రాష్ట్ర్ర ప్రభుత్వాలతో పాటు…భారత క్రికెట్ సూపర్ స్టార్లు సచిన్ టెండుల్కర్, విరాట్ కొహ్లీ.. పోరాటం మొదలు పెట్టారు. కరోనా నిరోధక ప్రచారంలో విరాట్ కొహ్లీ తన భార్య అనుష్కతో కలసి పాల్గొంటుంటే… మాస్టర్ సచిన్ సైతం తానూ చేయాల్సింది చేస్తున్నాడు. కరోనాకు నివారణే మందు-విరుష్క మానవాళిపై పెనుతుపానులా విరుచుకుపడుతున్న కరోనా వైరస్ నిరోధానికి మందు ఏదీ లేదని…అయితే […]

Advertisement
Update:2020-03-21 02:39 IST
  • హ్యాండ్ వాష్…కరోనా స్మాష్ అంటున్న సచిన్

ప్రపంచ దేశాలతో పాటు భారత్ ను భయపెడుతున్న కరోనా వైరస్ పై కేంద్ర, రాష్ట్ర్ర ప్రభుత్వాలతో పాటు…భారత క్రికెట్ సూపర్ స్టార్లు సచిన్ టెండుల్కర్, విరాట్ కొహ్లీ.. పోరాటం మొదలు పెట్టారు.

కరోనా నిరోధక ప్రచారంలో విరాట్ కొహ్లీ తన భార్య అనుష్కతో కలసి పాల్గొంటుంటే… మాస్టర్ సచిన్ సైతం తానూ చేయాల్సింది చేస్తున్నాడు.

కరోనాకు నివారణే మందు-విరుష్క

మానవాళిపై పెనుతుపానులా విరుచుకుపడుతున్న కరోనా వైరస్ నిరోధానికి మందు ఏదీ లేదని…అయితే ..ముందుజాగ్రత్త చర్యలతో తీసుకొనే నివారణ మాత్రమే మందని భారత సెలెబ్రిటీ జోడీ విరాట్ కొహ్లీ- అనుష్క శర్మ చెప్పారు.

మార్చి 22న దేశంలోని ప్రతిఒక్కరూ జనతా కర్ఫ్యూని పాటించాలంటూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన వెంటనే భారత కెప్టెన్ కొహ్లీ తన భార్య అనుష్కతో కలసి ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశాడు.

ప్రధాని పిలుపుమేరకు దేశప్రజలందరూ 14 గంటలపాటు తమ ఇంటిపట్టునే ఉండి… ఏకాంతవాసం చేస్తే కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టినవారవుతారని, ఎవరి ఆరోగ్యాన్ని వారు చూసుకొంటే దేశం ఆరోగ్యం బాగుంటుందని, అందరూ కలసికట్టుగా ఉంటే… వైరస్ మహమ్మారిని తరిమికొట్టడం ఏమంత కష్టంకాబోదని తమ సందేశంలో తెలిపారు.

ప్రధాని మోడీ మాటను విందాం- విరాట్

జనతా కర్ఫ్యూ పాటించాలంటూ ప్రధాని మోడీ దేశప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన వెంటనే… భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కొహ్లీ ట్విట్టర్ ద్వారా స్పందించాడు.

దేశప్రజల హితం కోరి ప్రధాని పిలుపునిచ్చారని, ఈనెల 22న అందరమూ జనతా కర్ఫ్యూను పాటించడం ద్వారా కరోనా వైరస్ నివారణకు కలసికట్టుగా కృషి చేసినట్లవుతుందని చెప్పాడు. బాధ్యతగల భారత పౌరులుగా ప్రధాని సూచనలు పాటిద్దామని పిలుపునిచ్చాడు.

కరోనా వైరస్ వ్యాపికి అడ్డుకట్ట వేయటానికి నిరంతరం పాటుపడుతున్న లక్షలాదిమంది వైద్యసిబ్బందికి విరాట్ కొహ్లీ హ్యాట్సాఫ్ చెప్పాడు. ప్రపంచ వ్యాప్తంగా.. కరోనాతో పోరాడుతున్న కోట్లాదిమంది సిబ్బందికి రుణపడి ఉంటామని అన్నాడు. అందరూ వ్యక్తిగత శుభ్రత పాటించాలని, కరోనా వైరస్ కు మందు ఏదీలేదని, వ్యక్తిగత శుభ్రత, ముందుజాగ్రత్త చర్యలే తగిన మందు అని తెలిపాడు.

సచిన్ హ్యాండ్ వాష్ ప్రచారం….

మరోవైపు…భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ సైతం…కరోనా వైరస్ ను దీటుగా ఎదుర్కొనాలంటే వ్యక్తిగత శుభ్రతతో పాటు…పరిసరాల శుభ్రత, బాధ్యతగల పౌరులుగా ప్రతిఒక్కరూ మెలగడం ముఖ్యమని…హ్యాండ్ వాష్ చాలెంజ్ కార్యక్రమంలో పాల్గొంటూ చెప్పాడు.

అందరూ గంటకోసారి సబ్బు లేదా శానిటైజర్స్ తో చేతులు శుభ్రం చేసుకొంటూ ఉండాలని కోరాడు. దీపిక పడుకోన్ తో సహా పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం.. హ్యాండ్ వాష్ కార్యక్రమాన్ని భారీఎత్తున ప్రచారం చేస్తూ తమవంతుగా చేతులు కడుక్కొంటున్నారు.

Tags:    
Advertisement

Similar News