కోవిడ్-19 దెబ్బతో ఐపీఎల్ -13 హిట్ వికెట్

ఐపీఎల్ భవితవ్యం తేలేది ఏప్రిల్ 15 తర్వాతే.. కరోనా వైరస్ దెబ్బతో వాయిదా పడిన ఐపీఎల్ 13వ సీజన్ పోటీలు నిర్వహించేది..లేనిదీ తేలేది ఏప్రిల్ 15 తర్వాతేనని… కేంద్ర క్రీడామంత్రి కిరణ్ రిజ్జూ చెప్పారు. మార్చి 29 న ముంబై వాంఖెడీ స్టేడియంలో ప్రారంభంకావాల్సిన 2020 ఐపీఎల్ హంగామాను… కేంద్ర క్రీడామంత్రిత్వశాఖ ఆదేశాలతో ఏప్రిల్ 15 వరకూ వాయిదా వేశారు. ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన క్రికెట్ లీగ్ మాత్రమే కాదు…భారత క్రికెటర్లకు, క్రికెట్ బోర్డుకు గత 12 సీజన్లుగా కాసుల […]

Advertisement
Update:2020-03-20 02:25 IST
  • ఐపీఎల్ భవితవ్యం తేలేది ఏప్రిల్ 15 తర్వాతే..

కరోనా వైరస్ దెబ్బతో వాయిదా పడిన ఐపీఎల్ 13వ సీజన్ పోటీలు నిర్వహించేది..లేనిదీ తేలేది ఏప్రిల్ 15 తర్వాతేనని… కేంద్ర క్రీడామంత్రి కిరణ్ రిజ్జూ చెప్పారు. మార్చి 29 న ముంబై వాంఖెడీ స్టేడియంలో ప్రారంభంకావాల్సిన 2020 ఐపీఎల్ హంగామాను… కేంద్ర క్రీడామంత్రిత్వశాఖ ఆదేశాలతో ఏప్రిల్ 15 వరకూ వాయిదా వేశారు.

ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన క్రికెట్ లీగ్ మాత్రమే కాదు…భారత క్రికెటర్లకు, క్రికెట్ బోర్డుకు గత 12 సీజన్లుగా కాసుల వర్షం కురిపిస్తూ వస్తున్న ఐపీఎల్ వ్యాపారాన్ని కరోనా వైరస్ గట్టి దెబ్బే కొట్టింది. వాయిదా వేయటంతోనే వందలకోట్ల రూపాయల మేర నష్టంతప్పదని ఫ్రాంచైజీ యజమానులు ఓవైపు వాపోతుంటే… మరోవైపు.. కేంద్రక్రీడామంత్రి కిరణ్ రిజ్జూ మాత్రం… ఏప్రిల్ 15న ప్రభుత్వం తీసుకొనే నిర్ణయంపైనే లీగ్ నిర్వహించేది..లేనిది తేలిపోనుందని చెబుతున్నారు.

దేశంలోని క్రీడాసంఘాలన్నీ తమతమ క్రీడాకార్యకలాపాలను నిలిపివేయాలంటూ కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది. హైల్త్ ఎడ్వైజరీని విడుదల చేసింది. తదుపరి హెల్త్ ఎడ్వైజరీని తిరిగి ఏప్రిల్ 15న విడుదల చేయనున్నారు.

అప్పటికి కోరనా వైరస్ ఉపశమించి…సాధారణ పరిస్థితులు నెలకొంటేనే ఐపీఎల్ ను కొనసాగించే అవకాశాలు ఉంటాయి. లేకుంటే రద్దుల పద్దులో చేరే ప్రమాదంలేక పోలేదు.

తదుపరి హెల్త్ ఎడ్వైజరీని విడుదల చేయటం వరకే భారతప్రభుత్వం విధి అని, దానిని క్రీడాసంఘాలన్నీ విధిగా పాటించి తీరక తప్పదని చెప్పారు. ఐపీఎల్ భవితవ్యాన్ని తేల్చేది మాత్రం భారత క్రికెట్ నియంత్రణమండలి మాత్రమేనని కిరణ్ రిజ్జూ తేల్చి చెప్పారు.

కరోనా వైరస్ విజృంభణతో ప్రపంచ వ్యాప్తంగా క్రీడాకార్యకలాపాలు స్తంభించిపోయాయి. ఇప్పటికే కరోనా కాటుకు గురై 9 వేలమంది మృతి చెందగా… 2లక్షల మంది కరోనా పాజిటివ్ గా తేలి చికిత్స పొందుతున్నారు.

Tags:    
Advertisement

Similar News