సీఎం వద్దు... పార్టీ అధ్యక్షుడు చాలు... రజినీకాంత్ సంచలన నిర్ణయం

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తన అభిమాన సంఘం ఆఫీస్ బేరర్లతో కీలక సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత మీడియా సమావేశంలో సంచలన విషయాలు మాట్లాడారు. తమిళ రాజకీయాల్లో మార్పులు తీసుకొస్తానని.. తాను రాజకీయాల్లోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. చెన్నైలోని ఒక హోటల్ లో రజినీకాంత్ తన మక్కల్ మండ్రమ్ ఆఫీస్ బేరర్లు, ఫ్యాన్స్ సంఘాలతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. […]

Advertisement
Update:2020-03-12 08:27 IST

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తన అభిమాన సంఘం ఆఫీస్ బేరర్లతో కీలక సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత మీడియా సమావేశంలో సంచలన విషయాలు మాట్లాడారు. తమిళ రాజకీయాల్లో మార్పులు తీసుకొస్తానని.. తాను రాజకీయాల్లోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.

చెన్నైలోని ఒక హోటల్ లో రజినీకాంత్ తన మక్కల్ మండ్రమ్ ఆఫీస్ బేరర్లు, ఫ్యాన్స్ సంఘాలతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. జయలలిత మరణం తర్వాత తమిళనాడు రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఏర్పడిందన్నారు.

తమిళనాడు పాలిటిక్స్ లో ఎంటర్ కావడానికి తనకు మూడు ప్రణాళికలున్నాయని రజినీ తెలిపారు. రాజకీయ నాయకులకు ప్రజలు అంటే ప్రయోజనాలు, సంక్షేమం కాదని స్పష్టం చేశారు. యువరక్తాన్ని పార్టీలో నింపడం.. పార్టీలో ఒకే వ్యక్తి పెత్తనం లేకుండా చేయడం.. పార్టీ అధికారంలోకి వస్తే పార్టీ అధినేతగా మాత్రమే కొనసాగుతానని.. ముఖ్యమంత్రిగా మరో అభ్యర్థి ఉంటారని.. సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం అవ్వాలన్న ఆశలేదని రజినీ కుండబద్దలు కొట్టారు. ప్రభుత్వంలో పార్టీ అధ్యక్షుడి ప్రమేయం ఉండదన్నారు.

Tags:    
Advertisement

Similar News