గూగూల్ ను తాకిన కరోనా ఎఫెక్ట్

కరోనా. కరోనా.. కరోనా… ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా(కోవిడ్-19) వైరస్ పేరు మారుమ్రోగుతోంది. చైనాలో సోకిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది. ప్రపంచంలోని అన్ని దేశాలకు విస్తరిస్తూ భయాందోళనలకు గురిచేస్తుంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కరోనా దెబ్బకు 4వేల మంది మృత్యువాతపడగా లక్షకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. అన్ని దేశాలు కరోనాపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కరోనాను తేలికగా తీసుకుంటే తగిన మూల్యం తప్పదని డబ్ల్యూహెచ్ఓ […]

Advertisement
Update:2020-03-12 08:02 IST

కరోనా. కరోనా.. కరోనా… ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా(కోవిడ్-19) వైరస్ పేరు మారుమ్రోగుతోంది. చైనాలో సోకిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది. ప్రపంచంలోని అన్ని దేశాలకు విస్తరిస్తూ భయాందోళనలకు గురిచేస్తుంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కరోనా దెబ్బకు 4వేల మంది మృత్యువాతపడగా లక్షకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి.

దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. అన్ని దేశాలు కరోనాపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కరోనాను తేలికగా తీసుకుంటే తగిన మూల్యం తప్పదని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది.

కరోనా ఎఫెక్ట్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడింది. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతినే పరిస్థితులు నెలకొన్నాయి. చమురుసహా వివిధ కంపెనీలపై కరోనా ప్రభావం పడింది. అదేవిధంగా ఐటీ, టెక్ దిగ్గజ సంస్థలు ఇప్పటికే ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నాయి.

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్, ఫేస్ బుక్ లాంటి సంస్థలు ఉద్యోగులకు ఇంటి నుంచి వర్క్ చేసే వెసులుబాటు కల్పించింది.. గూగుల్ సిలికాన్‌వ్యాలి, శాన్‌ప్రాన్సిస్కో, న్యూయార్క్‌లోని తమ కార్యాలయాలకు వచ్చే సందర్శకులను కట్టడి చేస్తోంది. కరోనా వైరస్ వేగంగా విస్తరించడంతో ఐటీ, టెక్ దిగ్గజాలు ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయి. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు కల్పిస్తున్నాయి.

కంపెనీలు నియమాకాల్లో నేరుగా ఇంటర్వ్యూలు చేయడం లేదు. సాఫ్టువేర్ అభివృద్ధి సమావేశాలను కూడా రద్దు చేసుకుంటున్నాయి. కార్యాలయాలకు వచ్చే వారిని వీలైనంత వరకు రాకుండా కట్టడి చేస్తున్నాయి. కొత్తగా నియామకాలను గూగుల్ హ్యాంగవుట్, వర్చువల్ ఇంటర్వ్యూలను చేపట్టింది. లింక్డిన్, యాపిల్, ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్ సంస్థలు ఈ దారిలోనే నడుస్తున్నాయి. కరోనా ఎఫెక్ట్ ఇంకా ఎన్నిరోజులు కొనసాగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.

Tags:    
Advertisement

Similar News