అఫ్ఘానిస్థాన్‌పై విరుచుకుపడిన పాక్‌ యుద్ధవిమానాలు

మహిళలు, చిన్నారులతో సహా 15 మంది మృతి..ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించిన తాలిబన్లు

Advertisement
Update:2024-12-25 12:46 IST

అఫ్ఘనిస్థాన్‌పై పాకిస్థాన్‌ వైమానిక దాడులు చేసింది. ఈ దాడులలో మహిళలు, చిన్నారులతో సహా 15 మంది మృతి చెందారు పక్తికా ప్రావిన్స్‌లోని ఏడు గ్రామాలే లక్ష్యంగా దాడులు జరిగాయి.మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నదని తాలిబన్‌ అధికారులు తెలిపారు. వజీరిస్థానీలోని శరణార్థులే ఎక్కువగా మరణించినట్లు వెల్లడించారు. పాక్‌ దాడులను తాలిబన్‌ రక్షణ శాఖ ఖండించింది. పాక్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేసింది. ఈ దాడులు తామే చేసినట్లు పాక్‌ ఇప్పటివరకు ధృవీకరించలేదు. పాక్‌-అఫ్ఘాన్‌ సరిహద్దుల్లో ఇటీవల ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతున్నాయి. తమ దేశంలో జరిగిన ఉగ్రదాడులకు తాలిబన్ల సహకారం ఉంటున్నదని పాకిస్థాన్‌ ఆరోపిస్తున్నది. ఆ ఆరోపణలను తాలిబన్‌ ప్రభుత్వం ఖండిస్తున్నది. ఈ క్రమంలోనే పాక్‌ వైమానిక దాడులు చేసింది. 

Tags:    
Advertisement

Similar News