హిందువులపై దాడులను అడ్డుకోవాలి
బంగ్లాదేశ్‌కు స్పష్టం చేసిన అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులేవాన్
హిందులు ఇతర మైనారిటీలపై దాడులను అడ్డుకోవాలని, మానవ హక్కులతోపాటు అన్ని మతాలను గౌరవించేలా చర్యలు తీసుకోవాలని అమెరికా బంగ్లాదేశ్ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వాధినేత యూనస్‌ఖాన్‌తో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులేవాన్ ఫోన్‌లో మాట్లాడారు. దేశంలో మానవ హక్కులను కాపాడటానికి కట్టుబడి ఉన్నామని యూనస్‌ఖాన్ సులేవాన్‌కు తెలిపినట్లు వైట్‌హౌస్ ప్రకటన విడుదల చేసింది. క్లిష్ట పరిస్థితి నుంచి బైటపడటనికి స్థిరమైన ప్రజాస్వామ్య బంగ్లాదేశ్‌ను ఏర్పాటు చేయడానికి అమెరికా మద్దతు ఉంటుందని అమెరికా తెలిపింది. ఇటీవల డెమోక్రటిక్ పార్టీకి చెందిన చట్టసభల ప్రతినిధి ఒకరు బంగ్లాదేశ్ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. హిందువులు, మైనారిటీలపై దాడుల నేపథ్యంలో బంగ్లాదేశ్‌పై ఆంక్షలు విధించాలని బైడెన్, ట్రంప్‌లకు సూచించారు. ఈ నేపథ్యంలోనే జేక్ సులేవాన్ యూనస్‌ఖాన్‌తో ఫోన్ లో మాట్లాడారు.