సింధియాకు స్వైన్ ఫ్లూ ఉంది.... అందుకే బయట కనిపించడం లేదు !

మధ్యప్రదేశ్ రాజకీయాలు సంక్షోభంలో పడిన వేళ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ రాజకీయ సంక్షోభానికి కారణమైన జ్యోతిరాధిత్య సింధియాకు స్వైన్ ఫ్లూ వచ్చిందని అందుకే అతను బయట కనపడటం లేదని వ్యాఖ్యానించారు. మాతో మాట్లాడితే ఎక్కడ ఇతరులకు స్వైన్ ఫ్లూ అంటుకుంటుందేమోనని భయంతో ఆయన మమ్మల్ని కలవడానికి కూడా ట్రై చేయడం లేదని సెటైర్లు వేశారు. మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ ప్రభుత్వం ప్రస్తుతం తీవ్ర రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. […]

Advertisement
Update:2020-03-10 06:33 IST

మధ్యప్రదేశ్ రాజకీయాలు సంక్షోభంలో పడిన వేళ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ రాజకీయ సంక్షోభానికి కారణమైన జ్యోతిరాధిత్య సింధియాకు స్వైన్ ఫ్లూ వచ్చిందని అందుకే అతను బయట కనపడటం లేదని వ్యాఖ్యానించారు. మాతో మాట్లాడితే ఎక్కడ ఇతరులకు స్వైన్ ఫ్లూ అంటుకుంటుందేమోనని భయంతో ఆయన మమ్మల్ని కలవడానికి కూడా ట్రై చేయడం లేదని సెటైర్లు వేశారు.

మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ ప్రభుత్వం ప్రస్తుతం తీవ్ర రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పార్టీకి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు కనిపించకుండా పోయారు. వారందరూ జ్యోతిరాధిత్య సింధియా అనుచరులు కావడం గమనార్హం. కాగా, సింధియానే ప్రత్యేక విమానంలో వారిని మధ్యప్రదేశ్ దాటించాడని వార్తలు వస్తున్నాయి. తిరుగుబాటు చేసిన ఆ 17 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం బెంగళూరు సమీపంలోని ఒక రిసార్టులో ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం పదవి కోసమే సింధియా ఈ తిరుగుబాటు బావుటా ఎగరేశాడని పార్టీ భావిస్తోంది.

కాగా, సింధియా తిరుగుబాటుతో కమల్‌నాథ్ జాగ్రత్త పడ్డారు. క్యాబినెట్‌ను పునర్‌వ్యవస్థీకరణ చేయాలని నిర్ణయించారు. దీంతో 20 మంది మంత్రులతో రాజీనామా చేయించారు. సింధియా అందుబాటులోకి వస్తే తన వాళ్లకు ఏ శాఖలు కావాలో తీసుకోమని చెప్పాలని డిసైడ్ అయ్యారు. మరి ఈ సంక్షోభం ఎలా ముగుస్తుందో చూడాలి.

Tags:    
Advertisement

Similar News