కాంగ్రెస్‌కు సింధియా గుడ్‌ బై " నెక్ట్స్‌ టార్గెట్‌ రాజస్థాన్‌ ?

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ సర్కార్‌ సంక్షోభంలో పడిపోయింది. జ్యోతిరాదిత్య సింధియా హస్తం పార్టీకి హ్యాండిచ్చారు. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖామంత్రి అమిత్‌షాతో కలిసి ప్రధాని మోదీ ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ కు రాజీనామా చేస్తూ లేఖ విడుదల చేశారు. ఆ లేఖలో ఆయన మార్చి 9 డేట్‌ వేశారు. అంటే ఆయన ఒకరోజు ముందే రాజీనామాకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ సింధియాకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదని… దీంతో పార్టీలో తిరుగుబాటుకు తెరతీశారని ప్రచారం […]

Advertisement
Update:2020-03-10 07:17 IST

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ సర్కార్‌ సంక్షోభంలో పడిపోయింది. జ్యోతిరాదిత్య సింధియా హస్తం పార్టీకి హ్యాండిచ్చారు. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖామంత్రి అమిత్‌షాతో కలిసి ప్రధాని మోదీ ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ కు రాజీనామా చేస్తూ లేఖ విడుదల చేశారు. ఆ లేఖలో ఆయన మార్చి 9 డేట్‌ వేశారు. అంటే ఆయన ఒకరోజు ముందే రాజీనామాకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ సింధియాకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదని… దీంతో పార్టీలో తిరుగుబాటుకు తెరతీశారని ప్రచారం జరుగుతోంది. ఆయనకు ప్రధాని మోదీ కేబినెట్‌లో కేంద్రమంత్రి పదవి ఇస్తారని… వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో ఆయనను బీజేపీ తరఫున ఎన్నుకుంటారని ప్రచారం జరుగుతోంది. అందుకే తన వర్గంలోని 17 మంది ఎమ్మెల్యేలతో కలిసి మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ సర్కారును కూల్చి… బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సింధియా సహకరిస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏ క్షణమైనా సింధియా వర్గం రాజీనామా చేసే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కమల్‌నాథ్‌ ఏం చేయనున్నారన్నది ఆసక్తికరంగా మారింది.

మధ్యప్రదేశ్‌లో తాజా రాజకీయ పరిణామాలతో బీజేపీ వేగంగా పావులు కదుపుతోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా… ఆ పార్టీ నేతలతో సమావేశమై చర్చలు జరిపారు. ఇవాళ పార్టీ శాసనసభా పక్షం అత్యవసరంగా సమావేశం కానుంది. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు భోపాల్‌కు చేరుకున్నారు శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, నరోత్తమ్‌ మిశ్రా. బీజేపీలోకి ఎవరు వచ్చినా స్వాగతం పలుకుతామని… సింధియా పెద్ద నేత అని… ఆయన పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామన్నారు.

ఇప్పటికే జ్యోతిరాదిత్య సింధియా మద్దతుదారులైన 17మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బెంగుళూరు రిసార్టుల్లో మకాం వేశారు. వారిలో ఆరుగురు మంత్రులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు కమల్‌నాథ్‌. రాత్రి అత్యవసరంగా మంత్రివర్గ సమావేశం ఏర్పాటుచేశారు. అనంతరం మంత్రులంతా రాజీనామాలు చేశారు. మరోవైపు రాహుల్‌గాంధీ కూడా పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో రాత్రి సమావేశమయ్యారు. మధ్యప్రదేశ్‌ రాజకీయాలపై చర్చించారు.

ఇక అంతకుముందు ఢిల్లీలో సోనియాగాంధీతో సమావేశమైన కమల్‌నాథ్‌..రాష్ట్రంలోని తాజా పరిణామాలపై చర్చించారు. సోనియా ఆదేశాల ప్రకారం నడుచుకుంటామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే మంత్రుల రాజీనామాలకు ఆమోదం తెలిపిన కమల్‌నాథ్‌… తన కేబినెట్‌ను పునర్‌వ్యవస్థీకరించనున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం కమల్నాథ్ ప్రభుత్వానికి 120 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. 230 మంది సభ్యుల అసెంబ్లీలో మెజారిటీకి నాలుగు స్థానాలు మాత్రమే ఎక్కువగా ఉన్నాయి. అందులో 114 కాంగ్రెస్, బీఎస్పీ 2, సమాజ్ వాదీ పార్టీ ఒకటి, నలుగురు స్వతంత్రులు ఉన్నారు. గతంలో 10 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బెంగళూరుకు తరలిపోగా… వారిలో ఆరుగురిని కమల్‌నాథ్‌ తిరిగి రప్పించుకున్నారు. ఇంకా నలుగురు అక్కడే రిసార్టులో ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

ఇదిలా ఉండగా త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌ నుంచి మూడు సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్‌, బీజేపీ చెరో స్థానాన్ని దక్కించుకునేందుకు మెజారిటీ ఉండగా… మూడో సీటు కోసం పోటాపోటీ నెలకొంది.

మధ్యప్రదేశ్‌ ఆపరేషన్‌ ముగిసిన తర్వాత… రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ ను వీక్‌ చేసే గేమ్‌ప్లాన్‌ను బీజేపీ తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News