మాట నిలబెట్టుకున్న జగన్... రాజ్యసభ అభ్యర్థులు ఖరారు

మాట తప్పను మడమ తిప్పను అని ఎప్పుడూ చెప్పే సీఎం జగన్ మరో సారి తన నైజాన్ని చాటుకున్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం పార్టీ తీసుకున్న ఒక నిర్ణయం వల్ల ఇద్దరు తమ మంత్రి, ఎమ్మెల్సీ పదవులను కోల్పోవాల్సి వచ్చింది. ఏపీ రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులు మండలిలో సెలెక్ట్ కమిటీకి పంపాలని చైర్మన్ షరీఫ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరంగా మారింది. దీంతో వైసీపీ పార్టీ మండలిని రద్దు చేయాలని […]

Advertisement
Update:2020-03-09 12:20 IST

మాట తప్పను మడమ తిప్పను అని ఎప్పుడూ చెప్పే సీఎం జగన్ మరో సారి తన నైజాన్ని చాటుకున్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం పార్టీ తీసుకున్న ఒక నిర్ణయం వల్ల ఇద్దరు తమ మంత్రి, ఎమ్మెల్సీ పదవులను కోల్పోవాల్సి వచ్చింది. ఏపీ రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులు మండలిలో సెలెక్ట్ కమిటీకి పంపాలని చైర్మన్ షరీఫ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరంగా మారింది.

దీంతో వైసీపీ పార్టీ మండలిని రద్దు చేయాలని నిర్ణయించింది. కాగా, ఈ నిర్ణయంతో మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపీదేవి వెంకటరమణలు ఎమ్మెల్సీ పదవులు కోల్పోతారు. దీంతో మంత్రి పదవికి కూడా ఎసరొస్తుంది. అప్పుడే వారిద్దరినీ పిలిచి భవిష్యత్‌లో మంచి పదవులు మీకు వస్తాయని, తాను మాటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా వారిద్దరికీ రాజ్యసభ అభ్యర్థిత్వాలు ఖరారు చేశారు.

వైసీపీ పార్టీ తరపున నలుగురు రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించారు. మంత్రులు మోపీదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్‌తో పాటు పారిశ్రామికవేత్త అయోధ్య రామిరెడ్డి, మరో పారిశ్రామిక వేత్త పరిమళ్ నత్వానీకి అభ్యర్థిత్వం వరించింది. ఈ మేరకు వైసీపీ ఒక ప్రకటన వెలువరించింది.

Tags:    
Advertisement

Similar News