రాహుల్ గాంధీకి కరోనా పరీక్షలు..!
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీకి ఇటీవల కరోనా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. గత నెల 29న ఈ వైద్య పరీక్షలు నిర్వహించగా కాంగ్రెస్ పార్టీ ఆలస్యంగా ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ త్వరితగతిన వ్యాప్తి చెందుతోంది. ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా ఉన్నట్లు అనుమానించారు. దీనిపై బీజేపీ నేతలు వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఈ వైరస్ వ్యాప్తి చెందడంపై అప్రమత్తంగా ఉండాలని వ్యాఖ్యానించారు. […]
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీకి ఇటీవల కరోనా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. గత నెల 29న ఈ వైద్య పరీక్షలు నిర్వహించగా కాంగ్రెస్ పార్టీ ఆలస్యంగా ఈ విషయాన్ని వెల్లడించింది.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ త్వరితగతిన వ్యాప్తి చెందుతోంది. ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా ఉన్నట్లు అనుమానించారు. దీనిపై బీజేపీ నేతలు వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఈ వైరస్ వ్యాప్తి చెందడంపై అప్రమత్తంగా ఉండాలని వ్యాఖ్యానించారు.
కాగా, ఇటీవల ఇటలీలోని మిలాన్‌లో పర్యటించిన రాహుల్ గాంధీ ఫిబ్రవరి 29న ఇండియాకు చేరుకోగానే ఢిల్లీ విమానాశ్రయంలో కరోనా వైద్య పరీక్షలు నిర్వహించారు. అయనకు ఎలాంటి వైరస్ సోకలేదని అక్కడి వైద్యులు తేల్చి చెప్పడంతో ఇంటికి వెళ్లిపోయారు.
దీనిపై కాంగ్రెస్ స్పందిస్తూ.. జెడ్+ సెక్యూరిటీలో ఉండే రాహుల్ గాంధీ, ఇటలీ నుంచి రాగానే విమానాశ్రయ అధికారులు వైద్య పరీక్షల గురించి చెప్పారు. ఆయన ఎలాంటి సంకోచం లేకుండా సామాన్యుల లాగ క్యూలో నిలబడి వైద్య పరీక్షలు చేయించుకున్నారని కాంగ్రెస్ వెల్లడించింది. ఇకనైనా బీజేపీ ఇలాంటి చవకబారు విమర్శలు మానుకోవాలని సూచించింది.