రెండు చాన‌ళ్ల‌పై 48 గంట‌ల బ్యాన్‌

ఢిల్లీ అల్ల‌ర్ల క‌వ‌రేజ్‌ విష‌యంలో నిబంధ‌న‌లను అతిక్ర‌మించార‌ని రెండు మ‌లయాళ చాన‌ళ్ల‌పై 48 గంట‌ల నిషేధం విధించారు. ఏషియా నెట్, మీడియా వన్ చానెళ్లపై బ్యాన్ అమ‌ల్లోకి వ‌చ్చింది. శుక్ర‌వారం రాత్రి గం 7:30 నుంచి 48 గంటల పాటు ప్ర‌సారాలు నిలిపివేశారు. మత ఘర్షణలపై వివాదాస్పదంగా వార్తలు ప్రసారం చేశారని సమాచార ప్రసారాల శాఖ ఛానెళ్ల ప్రసారాలు నిలిపివేసింది. ఢిల్లీ అల్లర్ల కవరేజి విషయంలో దేశవ్యాప్తంగా అన్ని చానెళ్ల ప్రసారాలను సమాచార ప్రసారాల శాఖ ప‌రిశీలించింది. […]

Advertisement
Update:2020-03-07 02:38 IST

ఢిల్లీ అల్ల‌ర్ల క‌వ‌రేజ్‌ విష‌యంలో నిబంధ‌న‌లను అతిక్ర‌మించార‌ని రెండు మ‌లయాళ చాన‌ళ్ల‌పై 48 గంట‌ల నిషేధం విధించారు. ఏషియా నెట్, మీడియా వన్ చానెళ్లపై బ్యాన్ అమ‌ల్లోకి వ‌చ్చింది. శుక్ర‌వారం రాత్రి గం 7:30 నుంచి 48 గంటల పాటు ప్ర‌సారాలు నిలిపివేశారు. మత ఘర్షణలపై వివాదాస్పదంగా వార్తలు ప్రసారం చేశారని సమాచార ప్రసారాల శాఖ ఛానెళ్ల ప్రసారాలు నిలిపివేసింది.

ఢిల్లీ అల్లర్ల కవరేజి విషయంలో దేశవ్యాప్తంగా అన్ని చానెళ్ల ప్రసారాలను సమాచార ప్రసారాల శాఖ ప‌రిశీలించింది. ఏషియానెట్‌, మీడియా వ‌న్ చానళ్లు రెండు వర్గాల మధ్య విద్వేషాలు పెంచేవిధంగా రిపోర్టింగ్‌ చేశాయని స‌మాచార శాఖ‌ పేర్కొంది.

ఈశాన్య ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఫిబ్రవరి 23 న అల్లర్లు చేలరేగాయి. అయితే ఈ ఘ‌ర్ష‌ణ‌ల‌ను సున్నితంగా భావించిన కేంద్రం… సంయ‌మ‌నం పాటించాల‌ని న్యూస్ చాన‌ళ్ల‌ను కోరింది. రిపోర్టింగ్‌లో జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని కోరింది.

మ‌ల‌యాళ చానెళ్లు మృతుల సంఖ్య‌తో పాటు విజువ‌ల్స్ రిపీట్ చేస్తూ రెచ్చ గొట్టే విధంగా ప్ర‌సారం చేయగా… స‌మాచారశాఖ వాటిని వివ‌ర‌ణ కోరింది. అయితే ఆ చానెళ్లు ఇచ్చిన వివ‌ర‌ణ‌తో సంతృప్తి చెందని స‌మాచార‌శాఖ‌… నిబంధ‌న‌ల మేర‌కు 48 గంట‌ల పాటు వాటి ప్ర‌సారాలు నిలిపివేసింది. ఈ మేర‌కు ఉత్త‌ర్వులు జారీ చేసింది.

రాబోయే రోజుల్లో మ‌త ఘ‌ర్ష‌ణ‌ల‌తో ఇత‌ర హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు ప్రసారం చేసే విష‌యంలో చాన‌ళ్లు సంయ‌మ‌నం పాటించాల‌ని స‌మాచార శాఖ కోరింది.

Tags:    
Advertisement

Similar News