మీడియాను చూసి పారిపోయిన కరోనా అనుమానితుడు..!

ఇప్పుడు మీడియాలో ఎక్కడ చూసినా కరోనా సంబంధిత వార్తలే. ఒక వైపు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో కరోనా లేదని చెబుతున్నా సరే అదిగో కరోనా.. ఇదిగో కరోనా అంటూ వార్తలు వస్తున్నాయి. ఎవరికైనా కాస్త దగ్గు, జలుబు ఉన్నా సరే వారితో మాట్లాడటానికి జంకుతున్నారు. ఒకవైపు మీడియా కరోనా నుంచి ఎలా రక్షించుకోవాలో చెబుతూనే.. కరోనా బాధితులు అంటూ వార్తలు ప్రసారం చేస్తుండటంతో ప్రజల్లో భయాందోళనలు మరింతగా పెరుగుతున్నాయి. అవి ఎంతగా అంటే ఆసుపత్రులకు వచ్చే బాధితులు […]

Advertisement
Update:2020-03-06 11:27 IST

ఇప్పుడు మీడియాలో ఎక్కడ చూసినా కరోనా సంబంధిత వార్తలే. ఒక వైపు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో కరోనా లేదని చెబుతున్నా సరే అదిగో కరోనా.. ఇదిగో కరోనా అంటూ వార్తలు వస్తున్నాయి.

ఎవరికైనా కాస్త దగ్గు, జలుబు ఉన్నా సరే వారితో మాట్లాడటానికి జంకుతున్నారు. ఒకవైపు మీడియా కరోనా నుంచి ఎలా రక్షించుకోవాలో చెబుతూనే.. కరోనా బాధితులు అంటూ వార్తలు ప్రసారం చేస్తుండటంతో ప్రజల్లో భయాందోళనలు మరింతగా పెరుగుతున్నాయి. అవి ఎంతగా అంటే ఆసుపత్రులకు వచ్చే బాధితులు మీడియాను చూసి పారిపోయేంత.

జనగామ జిల్లాలో ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. లింగాల ఘనపురం మండలం ఆర్టీసీ కాలనీకి చెందిన సూర చందు అనే వ్యక్తి రెండు రోజుల క్రితం దుబాయ్ నుంచి స్వగ్రామానికి వచ్చాడు. కాగా వచ్చిన దగ్గర నుంచి జలుబు, దగ్గుతో బాధపడుతుండటంతో జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాడు. అయితే వైద్యులు కరోనా అనే అనుమానంతో ఒక గదిలో ఉంచి చికిత్స చేయాలని భావించారు.

కాగా, ఈ విషయం తెలిసి మీడియా ప్రతినిధులు అక్కడకు చేరుకొని అనుమానితుడి వీడియోలు, ఫొటోలు తీయడం ప్రారంభించారు. దీంతో మీడియాకు ఎక్కించి పరువు తీస్తారని భావించిన అతను ఆసుపత్రి నుంచి బయటకు వచ్చి స్నేహితుడి బైక్‌పై పారిపోయాడు. విషయం తెలుసుకున్న వైద్యులు అవాక్కయ్యారు. వెంటనే అతని బంధువులకు ఫోన్ చేసి.. వెంటనే ఆసుపత్రికి రావాలని.. చికిత్సకు సహకరించాలని కోరారు. అంతే కాకుండా మీడియాను ఆసుపత్రిలోనికి రాకుండా కట్టడి చేశారు.

Tags:    
Advertisement

Similar News