రోజా సవాల్... టీడీపీ వాళ్లు స్వీకరిస్తారా?

మద్య నిషేధాన్ని చిత్తశుద్ధితో దశల వారీగా అమలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీలున్న ప్రతిసారీ చెబుతూ వస్తోంది. అందుకు తగినట్టే రాష్ట్ర వ్యాప్తంగా 43 వేల బెల్టు షాపులను ప్రభుత్వం నిర్మూలించిందని… మద్యం షాపుల పని వేళలు కుదించామని.. అక్రమంగా మద్యం అమ్మకాలు జరిగితే అడ్డుకుంటున్నామని వైసీపీ నేతలు చెబుతున్నారు. అందుకు తగినట్టే మద్య నిషేధం కూడా నెమ్మదిగా అమల్లోకి వస్తోంది. ఈ వ్యవహారంపై.. టీడీపీ నేతలు పదే పదే ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో […]

Advertisement
Update:2020-03-04 01:29 IST

మద్య నిషేధాన్ని చిత్తశుద్ధితో దశల వారీగా అమలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీలున్న ప్రతిసారీ చెబుతూ వస్తోంది. అందుకు తగినట్టే రాష్ట్ర వ్యాప్తంగా 43 వేల బెల్టు షాపులను ప్రభుత్వం నిర్మూలించిందని… మద్యం షాపుల పని వేళలు కుదించామని.. అక్రమంగా మద్యం అమ్మకాలు జరిగితే అడ్డుకుంటున్నామని వైసీపీ నేతలు చెబుతున్నారు. అందుకు తగినట్టే మద్య నిషేధం కూడా నెమ్మదిగా అమల్లోకి వస్తోంది.

ఈ వ్యవహారంపై.. టీడీపీ నేతలు పదే పదే ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం దుకాణాలు నిర్వహించడం ద్వారా.. ఇంటింటికీ మద్యాన్ని డోర్ డెలివరీ చేస్తున్నారన్న ఆరోపణలను కూడా గుప్పించారు. వైసీపీ నేతలు ఇన్నాళ్లూ ఈ ఆరోపణలు కొట్టి పారేస్తూ వస్తున్నా.. ఆ పార్టీ ఫైర్ బ్రాండ్, ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా ఓ అడుగు ముందుకు వేశారు. టీడీపీ నేతల ఆరోపణలను ఖండించారు.

తమ పార్టీ నేతలు మద్యాన్ని డోర్ డెలివరీ చేస్తున్నట్టు నిరూపించాలని టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. ఈ ఆరోపణల్లో ఏ మాత్రం నిజం ఉందని తేలినా.. తాము రాజీనామా చేసి వెళ్లిపోతామని స్పష్టం చేశారు. ఈ సవాల్ ను టీడీపీలో ఎవరు స్వీకరిస్తారు? ఆరోపణలు చేసిన నాయకులు ముందుకు వస్తారా? తాము చేసిన ఆరోపణలను నిరూపిస్తారా? లేక డిఫెన్స్ పాలిటిక్స్ కు పరిమితం అవుతారా? అన్నది చర్చనీయాంశంగా మారింది.

మరోవైపు.. దశల వారీగా మద్య నిషేధాన్ని అబ్కారీ శాఖ మంత్రి నారాయణ స్వామి మరోసారి స్పష్టం చేశారు. ఇప్పుడున్న లిక్కర్ షాపుల్లో మరో 25 శాతం… ఈ ఏడాది మూసేస్తామని తేల్చి చెప్పారు. మరి.. మంత్రి నారాయణస్వామితో పాటు.. రోజా చేసిన వ్యాఖ్యలు, చెప్పిన వివరాలపై.. టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో మరి.

Tags:    
Advertisement

Similar News