ఐపీఎల్ కు కరోనా ముప్పులేనట్లే!

యధావిధిగా పోటీలంటున్న నిర్వాహక సంఘం ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన ఐపీఎల్ 13వ సీజన్ పోటీలకు కరోనా వైరస్ ముప్పులేనట్లేనని నిర్వాహక సంఘం చైర్మన్ బ్రిజేష్ పటేల్, బీసీసీఐ చైర్మన్ సౌరవ్ గంగూలీ ధీమాగా చెబుతున్నారు. మార్చి 29 నుంచి మే 24 వరకూ ఐదువారాలపాటు జరిగే ఈ టోర్నీ ప్రారంభమ్యాచ్ ముంబై వాంఖెడీ స్టేడియం వేదికగా ఈనెల 29న డిఫెండింగ్ చాంపియన్ ముంబై, రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరుగనుంది. కరోనా వైరస్ దెబ్బతో […]

Advertisement
Update:2020-03-04 01:19 IST
  • యధావిధిగా పోటీలంటున్న నిర్వాహక సంఘం

ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన ఐపీఎల్ 13వ సీజన్ పోటీలకు కరోనా వైరస్ ముప్పులేనట్లేనని నిర్వాహక సంఘం చైర్మన్ బ్రిజేష్ పటేల్, బీసీసీఐ చైర్మన్ సౌరవ్ గంగూలీ ధీమాగా చెబుతున్నారు.

మార్చి 29 నుంచి మే 24 వరకూ ఐదువారాలపాటు జరిగే ఈ టోర్నీ ప్రారంభమ్యాచ్ ముంబై వాంఖెడీ స్టేడియం వేదికగా ఈనెల 29న డిఫెండింగ్ చాంపియన్ ముంబై, రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరుగనుంది.

కరోనా వైరస్ దెబ్బతో ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 3వేల 100 మంది మృత్యువాత పడితే…90వేలమంది వైరస్ బారినపడి చికిత్స పొందుతున్నారు. అయితే… నిప్పులు చెరిగే ఎండవేడిమి ఉండే భారత వాతావరణంలో కరోనా వైరస్ గురించి భయపడాల్సింది ఏమీలేదని ఐపీఎల్ బోర్డు చైర్మన్ బ్రిజేష్ పటేల్ ప్రకటించారు. అలాఅని..తాము పరిస్థితిని గమనించకుండా లేమని…ఐపీఎల్ మ్యాచ్ లు వేసవికాలంలో జరుగుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు.

మార్చి 12 నుంచి సఫారీలతో వన్డే సిరీస్…

సౌతాఫ్రికాజట్టుతో మార్చి 12 నుంచి జరిగే మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ కు ఏవిధమైన అంతరాయం లేదని, కరోనా వైరస్ గురించి భయపడాల్సింది, చర్చించాల్సిందీ ఏమీలేదని బీసీసీఐ చైర్మన్ సౌరవ్ గంగూలీ చెప్పారు. సిరీస్ లోని తొలివన్డే మార్చి 12న ధర్మశాల వేదికగా ప్రారంభంకానుంది.

Tags:    
Advertisement

Similar News