ఐపీఎల్‌కి కూడా ఇషాంత్ దూరమేనా..?
టీం ఇండియా పేసర్ ఇషాంత్ శర్మ చీలమండ గాయంతో కివీస్ సిరీస్ నుంచి అర్థాంతరంగా వైదొలగిన విషయం తెలిసిందే. పాత గాయం తిరగబెట్టడంతో పాటు కొత్త గాయం కూడా ఇబ్బంది పెడుతుండటంతో రెండో టెస్టు తుది జట్టు నుంచి తప్పించారు. కాగా, ఇషాంత్‌కు వైద్య పరీక్షలు చేసిన డాక్టరు కనీసం ఆరు వారాల విశ్రాంతి అవసరమని తేల్చారు. దీంతో అతను ఐపీఎల్ తొలి అర్థ భాగం ఆడే అవకాశాలు లేనట్లే. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్న […]
టీం ఇండియా పేసర్ ఇషాంత్ శర్మ చీలమండ గాయంతో కివీస్ సిరీస్ నుంచి అర్థాంతరంగా వైదొలగిన విషయం తెలిసిందే. పాత గాయం తిరగబెట్టడంతో పాటు కొత్త గాయం కూడా ఇబ్బంది పెడుతుండటంతో రెండో టెస్టు తుది జట్టు నుంచి తప్పించారు. కాగా, ఇషాంత్‌కు వైద్య పరీక్షలు చేసిన డాక్టరు కనీసం ఆరు వారాల విశ్రాంతి అవసరమని తేల్చారు. దీంతో అతను ఐపీఎల్ తొలి అర్థ భాగం ఆడే అవకాశాలు లేనట్లే.
ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్న ఇషాంత్ శర్మ ఏప్రిల్ మూడో వారం వరకు విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మార్చి 29 నుంచే ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో తొలి అర్థభాగం ఇషాంత్ టోర్నీకి అందుబాటులో ఉండడు.
మరోవైపు ఇషాంత్ శర్మ ఫిట్‌గా ఉన్నాడంటూ బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ చీఫ్ ఫిజియో ఆశిష్ కౌషిక్ మీద బీసీసీఐ గుర్రుగా ఉంది. పాత గాయాలు తగ్గక ముందే ఇషాంత్‌కు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఇచ్చి కివీస్ పంపడంపై అతనిపై బీసీసీఐ ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కసోగీ రబాడా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నుంచి గాయం కారణంగా తప్పుకున్నాడు. ఇప్పుడు మరో పేసర్ ఇషాంత్ శర్మ కూడా అందుబాటులో లేకపోవడం ఆ జట్టును కలవరపెడుతోంది. మరి వీరిద్దరికి ప్రత్యామ్నాయంగా ఢిల్లీ జట్టు ఎవరిని తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.