అమరావతిపై బీజేపీ వాదనతో.... టీడీపీలో అయోమయం

ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో బీజేపీ అడుగులు.. ప్రతిపక్ష టీడీపీని అయోమయానికి గురి చేస్తున్నాయి. ఇందుకు కారణాలు చాలానే ఉన్నాయి. అందులో ఒకటి.. అమరావతే ఆంధ్రుల రాజధాని అంటూ బీజేపీ రాష్ట్ర నేతలు ప్రకటనలు ఇస్తూనే ఉన్నారు. కానీ.. విశాఖ, కర్నూలును రాజధానిగా ఒప్పుకొనేది లేదు అని మాత్రం వారు చెప్పడం లేదు. అంతే కాదు.. ఇటీవల పార్లమెంటు సమావేశాల్లో ఈ విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు.. రాజధాని విషయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదే అని కేంద్రం చెప్పింది. […]

Advertisement
Update:2020-02-29 07:30 IST

ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో బీజేపీ అడుగులు.. ప్రతిపక్ష టీడీపీని అయోమయానికి గురి చేస్తున్నాయి. ఇందుకు కారణాలు చాలానే ఉన్నాయి. అందులో ఒకటి.. అమరావతే ఆంధ్రుల రాజధాని అంటూ బీజేపీ రాష్ట్ర నేతలు ప్రకటనలు ఇస్తూనే ఉన్నారు. కానీ.. విశాఖ, కర్నూలును రాజధానిగా ఒప్పుకొనేది లేదు అని మాత్రం వారు చెప్పడం లేదు. అంతే కాదు.. ఇటీవల పార్లమెంటు సమావేశాల్లో ఈ విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు.. రాజధాని విషయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదే అని కేంద్రం చెప్పింది.

ఇటు రాష్ట్రంలో చూస్తే.. కన్నా లక్ష్మీ నారాయణ, కొందరు నేతలు మాత్రం పదే పదే.. అమరావతికే తమ ఓటు అని చెబుతున్నారు. అంతే కాక.. రాయలసీమలో హై కోర్టు ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీపై కేంద్రాన్ని కలుస్తామని కూడా అంటున్నారు. ఇలా.. ఎటు చూసినా మూడు రాజధానుల ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఆ పార్టీ నేతలు ఒక్క మాట కూడా మాట్లాడ్డం లేదు. కానీ.. అమరావతికే తమ ఓటు అని అంటున్నారు.

ఇదే.. టీడీపీని చికాకు పెడుతోంది. అసలు బీజేపీ ఏం చేస్తోంది.. అన్నది ఆ పార్టీకి అంతుబట్టకుండా ఉంది. ఇటీవల విశాఖలో అమరావతి గురించి మాట్లాడదామని వెళ్లిన చంద్రబాబుకు ఎదురుదెబ్బ తగిలింది. జనాల నుంచి మద్దతు కూడా కరువవుతోంది. ఉత్తరాంధ్రకు చెందిన పార్టీ నేతల నుంచి సహకారం పూర్తిగా కొరవడుతోంది. జనసేన కూడా.. బీజేపీకి దగ్గరైనప్పటి నుంచి టీడీపీ ఒంటరైంది. ఇప్పుడు అమరావతి వాదనను ఎలా ముందుకు తీసుకువెళ్లాలి.. ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలను ఎలా తిప్పి కొట్టాలి అన్నది.. ఆ పార్టీ నేతలకు మిలియన్ డాలర్ల ప్రశ్నగా కనబడుతోంది.

Tags:    
Advertisement

Similar News