“బాబూ మీకో దండం... ఇక చాలు... మీకు ఆ అర్హత లేదు”

తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు విశాఖ పర్యటన ఎంతటి విధ్వంసానికి కారణమైందన్నది ప్రజలందరికీ తెలుసు. ఈ విషయంలో అధికార, ప్రతిపక్షాలు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి. ఒకరిపై ఒకరు రాజకీయంగా దుమ్మెత్తి పోసుకుంటున్నారు నేతలు. ఈ నేపథ్యంలో.. టీడీపీ నేతల విమర్శలకు పదునైన ప్రతి విమర్శలు చేసిన మంత్రులు.. చంద్రబాబూ ఇక చాలు అంటున్నారు. మీరు చేసింది చాలు.. ఇక మళ్లీ రాకండి అని స్పష్టం చేస్తున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనను విశాఖ ప్రజలు ఏనాడూ వ్యతిరేకించలేదు. కానీ.. […]

Advertisement
Update:2020-02-28 08:14 IST

తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు విశాఖ పర్యటన ఎంతటి విధ్వంసానికి కారణమైందన్నది ప్రజలందరికీ తెలుసు. ఈ విషయంలో అధికార, ప్రతిపక్షాలు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి. ఒకరిపై ఒకరు రాజకీయంగా దుమ్మెత్తి పోసుకుంటున్నారు నేతలు.

ఈ నేపథ్యంలో.. టీడీపీ నేతల విమర్శలకు పదునైన ప్రతి విమర్శలు చేసిన మంత్రులు.. చంద్రబాబూ ఇక చాలు అంటున్నారు. మీరు చేసింది చాలు.. ఇక మళ్లీ రాకండి అని స్పష్టం చేస్తున్నారు.

మూడు రాజధానుల ప్రతిపాదనను విశాఖ ప్రజలు ఏనాడూ వ్యతిరేకించలేదు. కానీ.. చంద్రబాబు మాత్రం విశాఖవాసులు తమకు రాజధాని వద్దని అంటున్నారని.. వారు కూడా అమరావతినే రాజధానిగా కోరుకుంటున్నారని చాలా కాలంగా వింత వాదన చేస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రస్తావించిన మంత్రి బొత్స.. ఉత్తరాంధ్రకు, మరీ ముఖ్యంగా విశాఖకు అన్యాయం చేస్తున్న చంద్రబాబు.. ఎలా అక్కడ పర్యటిస్తారని ప్రశ్నించారు.

మరో మంత్రి.. ధర్మాన కృష్ణదాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. బాబుగారూ మీకో దండం… మరోసారి ఉత్తరాంధ్రలో తిరగొద్దు అంటూ స్పష్టం చేశారు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కూడా.. ఏనాడూ ఉత్తరాంధ్రను పట్టించుకోని వారికి ఆ ప్రాంతంలో తిరిగే అర్హత లేదని తేల్చేశారు. ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణితో పాటు శాసనసభాపతి తమ్మినేని సీతారాం కూడా చంద్రబాబు తీరుపై నిప్పులు చెరిగారు. ఆయన విధానాన్ని తప్పుబట్టారు.

ఇంత జరుగుతున్నా… ఇప్పటికీ అమరావతి వాదన వినిపిస్తూ.. టీడీపీ నేతలు చంద్రబాబును వెనకేసుకు వస్తున్నారు. ఉత్తరాంధ్రకు మేలు చేసే మూడు రాజధానుల ప్రతిపాదనను.. ఆ ప్రాంతంలోనే వ్యతిరేకించేందుకు పదే పదే ప్రయత్నిస్తున్నారు.

ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో ఉత్తరాంధ్రలో టీడీపీ మనుగడకు ఇబ్బందికరమన్న అభిప్రాయం కూడా సర్వత్రా వ్యక్తమవుతోంది.

Tags:    
Advertisement

Similar News