ఉగాది రోజు రజినీకాంత్ సంచలనం.. పార్టీ ప్రకటన ఖాయం?

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ అడుగులపై స్పష్టత వస్తోంది. ఇన్నాళ్లూ బీజేపీకి కాస్త అనుకూలంగా అభిప్రాయాలు వెల్లడిస్తూ వచ్చిన ఆయన.. తాజాగా ఢిల్లీలో జరిగిన అల్లర్లకు కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘా వైఫల్యం కారణం అంటూ ఘాటుగా విమర్శలు చేశారు. రాజకీయాల్లో తాను గతంలో చెప్పినట్టే.. ఒంటరి పోటీకే సిద్ధమన్న సంకేతాలు బలంగా.. స్పష్టంగా పంపారు. కేంద్రంతో చాలా విషయాల్లో విభేదిస్తూ వస్తున్న మక్కల్ నీది మయ్యం పార్టీ నేత, విలక్షణ నటుడు కమల్ హసన్ కూడా […]

Advertisement
Update:2020-02-28 08:40 IST

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ అడుగులపై స్పష్టత వస్తోంది. ఇన్నాళ్లూ బీజేపీకి కాస్త అనుకూలంగా అభిప్రాయాలు వెల్లడిస్తూ వచ్చిన ఆయన.. తాజాగా ఢిల్లీలో జరిగిన అల్లర్లకు కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘా వైఫల్యం కారణం అంటూ ఘాటుగా విమర్శలు చేశారు.

రాజకీయాల్లో తాను గతంలో చెప్పినట్టే.. ఒంటరి పోటీకే సిద్ధమన్న సంకేతాలు బలంగా.. స్పష్టంగా పంపారు. కేంద్రంతో చాలా విషయాల్లో విభేదిస్తూ వస్తున్న మక్కల్ నీది మయ్యం పార్టీ నేత, విలక్షణ నటుడు కమల్ హసన్ కూడా ఈ పరిణామాన్ని స్వాగతించారు. శభాష్ మిత్రమా.. అని రజినీని అభినందించారు.

ఈ అనూహ్య సందర్భాలే.. రజినీ రాజకీయ అరంగేట్రంపై సరికొత్త చర్చకు దారినిస్తున్నాయి. ఏప్రిల్ లో తమిళ ఉగాదికి రాజకీయ పార్టీ ప్రకటన ఖాయమని.. ఆయన సన్నిహిత వర్గాలు లీకులిస్తున్నాయి. అదే జరిగితే.. వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న తమిళ ఎన్నికలకు తగిన సమయం ఉంటుందని.. తన ఫ్యాన్ ఫాలోయింగ్ తో జనాన్ని అనూహ్యంగా తనవైపు లాక్కొనవచ్చన్నది రజినీ వ్యూహంగా కనిపిస్తోంది.

ఈ దిశగా.. రజినీకాంత్ స్పష్టమైన రాజకీయ లెక్కల్లో ఉన్నట్టుగా సమాచారం. బీజేపీతో జట్టు కడితే.. అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం ఉందన్నది.. తాజా పరిణామాల ఆధారంగా ఆయన కచ్చితమైన అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఎందుకంటే.. అన్నాడీఎంకేకు ఎలాగూ బలం లేదు. డీఎంకే.. ఓ రకంగా బీజేపీకి వ్యతిరేక భావజాలం ఉన్న పార్టీ. కమల్ మక్కల్ నీది మయ్యం.. ప్రతి సందర్భంలోనూ బీజేపీని తిట్టి పోస్తోంది. కాంగ్రెస్ సంగతి సరే సరి.

ఇలా.. తమిళనాట అన్ని పార్టీలు బీజేపీ వ్యతిరేక వైఖరి ఉన్న నేపథ్యంలో.. తాను అటు వైపు వెళ్తే అంతా కలిసి తన పార్టీపై విమర్శల దాడి చేసే అవకాశం ఉందని.. రజినీ ముందు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నట్టు సమాచారం. అందుకే.. ఎన్నికలు పూర్తయ్యే వరకూ.. బీజేపీతో స్పష్టమైన దూరాన్ని పాటించాలన్నదే ఆయన నిర్ణయంగా తమిళ రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ దిశగానే.. ఏప్రిల్ లో తమిళ ఉగాదికి రజినీ రాజకీయ రంగప్రవేశంపై అధికారిక ప్రకటన వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News