అదరగొట్టిన అభిమన్యు... ముచ్చటగా జగన్ ముసిముసి..!
విద్యా రంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలను మెజారిటీ తల్లిదండ్రులు స్వాగతిస్తున్నారు. అమ్మ ఒడి కావొచ్చు.. ఆంగ్ల మాధ్యమం కావొచ్చు.. ఫీజు రీయింబర్స్ మెంట్ కావొచ్చు.. జగనన్న వసతి దీవెన కావొచ్చు. ఏం చేసినా.. జగన్ ఏం నిర్ణయం తీసుకున్నా.. బాగుందని అభినందిస్తున్నారు. ఈ క్రమంలో.. విద్యార్థులు కూడా తమకు అందుతున్న సౌకర్యాలను ఆనందంగా స్వీకరిస్తూ.. సీఎం సర్ కు థ్యాంక్స్ చెబుతున్నారు. విజయనగరంలో జగనన్న వసతి దీవెన పథకాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించిన నేపథ్యంలో.. […]
విద్యా రంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలను మెజారిటీ తల్లిదండ్రులు స్వాగతిస్తున్నారు. అమ్మ ఒడి కావొచ్చు.. ఆంగ్ల మాధ్యమం కావొచ్చు.. ఫీజు రీయింబర్స్ మెంట్ కావొచ్చు.. జగనన్న వసతి దీవెన కావొచ్చు. ఏం చేసినా.. జగన్ ఏం నిర్ణయం తీసుకున్నా.. బాగుందని అభినందిస్తున్నారు. ఈ క్రమంలో.. విద్యార్థులు కూడా తమకు అందుతున్న సౌకర్యాలను ఆనందంగా స్వీకరిస్తూ.. సీఎం సర్ కు థ్యాంక్స్ చెబుతున్నారు.
విజయనగరంలో జగనన్న వసతి దీవెన పథకాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించిన నేపథ్యంలో.. అభిమన్యు అనే విద్యార్థి ఇందుకు నిదర్శనంగా ఓ ప్రసంగాన్ని ఇచ్చి.. అందరితో అభినందనలు అందుకున్నాడు. ముఖ్యంగా.. ముఖ్యమంత్రి జగన్ ను ముసిముసిగా ముచ్చటపడేలా చేసి.. ముద్దు కూడా పెట్టించుకున్నాడు. ఇంగ్లిష్ లో ప్రసంగించి.. ప్రభుత్వ పథకాలను వివరించాడు.
విద్యార్థులు, తల్లిదండ్రుల తరఫున ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెప్పడాన్ని తాను గౌరవంగా భావిస్తున్నానని చెప్పాడు. తాను బాగా చదివి ఐపీఎస్ కావాలని అనుకుంటున్నానని.. సీఎం జగన్.. తనకు విష్ణు భగవానుడితో సమానమని అనడంతో.. సభా ప్రాంగణం అంతా కళతారధ్వనులతో దద్దరిల్లింది. అలాగే.. ప్రభుత్వ పథకాలతో ప్రజలు లబ్ధి పొందుతున్న తీరు.. ముఖ్యంగా విద్యార్థులు లబ్ధి పొందుతున్న తీరును అభిమన్యు వివరించిన తీరుకు.. ప్రశంసలు దక్కాయి.
అభిమన్యు పూర్తిగా మాట్లాడిన తర్వాత… ఆత్మీయంగా దగ్గరికి తీసుకున్న సీఎం జగన్… అతడిని మనస్ఫూర్తిగా అభినందించారు. ఆశీర్వదించారు.