ప్రపంచ హాకీలీగ్ లో ఆస్ట్రేలియాకు భారత్ షాక్

పెనాల్టీ షూటౌట్లో 3-1తో భారత్ విజయం రెండంచెల సమరం 1-1తో డ్రా ప్రపంచ హాకీ ప్రో-లీగ్ రౌండ్ రాబిన్ లీగ్ రెండంచెల సమరంలో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్ర్రేలియాపై ప్రపంచ 4వ ర్యాంకర్ భారత్ ఎట్టకేలకు స్ఫూర్తిదాయక విజయం తో సమఉజ్జీగా నిలువగలిగింది. భువనేశ్వర్ కళింగ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ముగిసిన రెండో అంచె సమరంలో ఆతిథ్య భారత్ పెనాల్టీషూటౌట్ విజయంతో…బోనస్ పాయింట్ ను సైతం సంపాదించింది. ఆట నిర్ణితసమయంలో రెండుజట్లు చెరో రెండుగోల్స్ చేసి 2-2తో సరిజోడీగా నిలిచాయి. భారత […]

Advertisement
Update:2020-02-23 01:31 IST
  • పెనాల్టీ షూటౌట్లో 3-1తో భారత్ విజయం
  • రెండంచెల సమరం 1-1తో డ్రా

ప్రపంచ హాకీ ప్రో-లీగ్ రౌండ్ రాబిన్ లీగ్ రెండంచెల సమరంలో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్ర్రేలియాపై ప్రపంచ 4వ ర్యాంకర్ భారత్ ఎట్టకేలకు స్ఫూర్తిదాయక విజయం తో సమఉజ్జీగా నిలువగలిగింది.

భువనేశ్వర్ కళింగ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ముగిసిన రెండో అంచె సమరంలో ఆతిథ్య భారత్ పెనాల్టీషూటౌట్ విజయంతో…బోనస్ పాయింట్ ను సైతం సంపాదించింది.

ఆట నిర్ణితసమయంలో రెండుజట్లు చెరో రెండుగోల్స్ చేసి 2-2తో సరిజోడీగా నిలిచాయి. భారత ఆటగాళ్లలో రూపిందర్ పాల్ సింగ్, హర్మన్ ప్రీత్ సింగ్ ..పెనాల్టీ కార్నర్లను గోల్స్ గా మలచడం ద్వారా తమ జట్టు తరపున గోల్స్ సాధించారు.

ఆస్ట్రేలియా ఆటగాళ్లు ట్రెంట్ మిట్టన్, కెప్టెన్ ఆరన్ చెరో గోలు సాధించడంతో స్కోరు 2-2తో సమమయ్యింది. దీంతో విజేతను నిర్ణయించడానికి…పెనాల్టీ షూటౌట్ పాటించారు.

షూటౌట్లో భారత్ 3-1 గోల్స్ తేడాతో విజేతగా నిలిచింది. భారత్ తరపున హర్మన్ ప్రీత్,వివేక్ సాగర్ ప్రసాద్, లలిత్ ఉపాధ్యాయ గోల్స్ సాధించారు. ఆస్ట్ర్రేలియా ఆటగాడు డేనియల్ ఒక్కడే గోల్ స్కోరర్ గా నిలిచాడు.

ఈ విజయంతో భారత్ కు బోనస్ పాయింట్ సైతం దక్కింది. లీగ్ లో ఇప్పటి వరకూ ఆడిన మ్యాచ్ ల్లో నెదర్లాండ్స్ ను చిత్తు చేసిన భారత్…ప్రపంచ నంబర్ వన్ బెల్జియం, మాజీ నంబర్ వన్ ఆస్ట్ర్రేలియా జట్లపైన మాత్రం 1-1 రికార్డుతో 10 పాయింట్లు సాధించడం ద్వారా లీగ్ టేబుల్ మూడోస్థానంలో కొనసాగుతోంది.

ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించిన భారతజట్టు ఈ మధ్యకాలంలో సాధించిన అతిపెద్ద విజయాలు…ప్రపంచ నంబర్ వన్ బెల్జియం, మాజీ నంబర్ వన్ ఆస్ట్ర్రేలియాలపైన సాధించినవే కావడం విశేషం.

Tags:    
Advertisement

Similar News