‘ఆస్తుల ప్రకటన సరే... బినామీ ఆస్తులు, రహస్య ఖాతాల సంగతేంటి?’ లోకేష్...

టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబ ఆస్తుల ప్రకటనపై.. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇదో రొటీన్ డ్రామా అని.. ట్వీట్ చేశారు. చంద్రబాబు, లోకేష్‌ ఇద్దరూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికే కాదు.. దేశ ఆర్థిక పరిస్థితికీ జవాబుదారులంటూ వ్యాఖ్యానించారు. వారి పేరు మీద ఉన్న బినామీ ఆస్తులు, రహస్య ఖాతాల గురించి ఎవరికీ వివరాలు తెలియవని.. వాటిపై విచారణ జరిగితే అసలు విషయాలు బయటపడతాయని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏటా ప్రకటించినట్టే.. తమ కుటుంబ […]

Advertisement
Update:2020-02-21 05:11 IST

టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబ ఆస్తుల ప్రకటనపై.. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇదో రొటీన్ డ్రామా అని.. ట్వీట్ చేశారు. చంద్రబాబు, లోకేష్‌ ఇద్దరూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికే కాదు.. దేశ ఆర్థిక పరిస్థితికీ జవాబుదారులంటూ వ్యాఖ్యానించారు. వారి పేరు మీద ఉన్న బినామీ ఆస్తులు, రహస్య ఖాతాల గురించి ఎవరికీ వివరాలు తెలియవని.. వాటిపై విచారణ జరిగితే అసలు విషయాలు బయటపడతాయని కీలక వ్యాఖ్యలు చేశారు.

ఏటా ప్రకటించినట్టే.. తమ కుటుంబ సభ్యుల ఆస్తులను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ వెల్లడించారు. తన తల్లి ఆస్తి తగ్గిందని.. తండ్రి చంద్రబాబు ఆస్తి కాస్త పెరిగిందని చెప్పుకొచ్చారు. పనిలో పనిగా తన పేరిట, తన భార్య పేరిట, కుమారుడు దేవామ్ష్ పేరిట ఉన్న ఆస్తుల వివరాలనూ వెల్లడించారు. ఇదే సందర్భంలో. చంద్రబాబుపై ఉన్న ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణల వ్యవహారం చర్చకు వస్తోంది.

మరో 4 రోజుల్లో.. అంటే ఈనెల 26న ఈ వ్యవహారం ఏసీబీ కోర్టు ముందుకు రానుంది. ఎన్టీఆర్ సతీమణి, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకురాలు లక్ష్మీపార్వతి.. 2005 నుంచీ చంద్రబాబుపై ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా.. ఈ విషయంలో ఏసీబీని విచారణకు ఆదేశించాలంటూ ఏసీబీ కోర్టులోనే ఆమె పిటిషన్ వేశారు. ఈ నెల 26న తగిన ఉత్తర్వులు ఇస్తామన్న ధర్మాసనం.. ఆ రోజుకు విచారణ వాయిదా వేసింది.

ఇంతలోనే.. తమ కుటుంబ ఆస్తులు ఇంత.. అంత.. అని లోకేష్‌ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం ఎటు పోతుందన్న చర్చ… రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తోంది.

Tags:    
Advertisement

Similar News