వైరస్ భయం.... ఇంటి నుంచే పనికి ఐటీ సంస్థ అవకాశం
కొవిడ్ 19 పేరుగల కరోనా వైరస్ భయంతో ప్రపంచం వణుకుతున్న సమయమిది. చైనాలో పుట్టిన ఈ వైరస్.. ఇప్పటికే వందల మంది ప్రాణాలు బలి తీసుకుంది. మరింతమంది వ్యాధిగ్రస్తులను భయపెడుతోంది. ఈ భయంతో.. ఏ వైరస్ పేరు విన్నా.. అంతా ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రభావం ఐటీ రంగంపైనా పడుతోంది. ఏకంగా కార్యాలయాలను మూసివేసి మరీ.. సిబ్బందికి ఇంటి నుంచి పని చేసుకునే అవకాశాన్ని కల్పించేంతవరకూ పరిస్థితి చేరుకుంటోంది. జర్మనీకి చెందిన ఐటీ సంస్థ సాప్.. భారత్ […]
కొవిడ్ 19 పేరుగల కరోనా వైరస్ భయంతో ప్రపంచం వణుకుతున్న సమయమిది. చైనాలో పుట్టిన ఈ వైరస్.. ఇప్పటికే వందల మంది ప్రాణాలు బలి తీసుకుంది. మరింతమంది వ్యాధిగ్రస్తులను భయపెడుతోంది. ఈ భయంతో.. ఏ వైరస్ పేరు విన్నా.. అంతా ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రభావం ఐటీ రంగంపైనా పడుతోంది. ఏకంగా కార్యాలయాలను మూసివేసి మరీ.. సిబ్బందికి ఇంటి నుంచి పని చేసుకునే అవకాశాన్ని కల్పించేంతవరకూ పరిస్థితి చేరుకుంటోంది.
జర్మనీకి చెందిన ఐటీ సంస్థ సాప్.. భారత్ లోని బెంగళూరు కార్యాలయానికి చెందిన తన ఇద్దరు ఉద్యోగులకు స్వైన్ ఫ్లూ వైరస్ హెచ్ 1 ఎన్ 1 సోకడంతో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాణాంతక వైరస్ మరింత విస్తరించకుండా ఉండేందుకు.. బెంగళూరు మాత్రమే కాదు.. గుర్గావ్, ముంబైల్లోని తన కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేసింది. శానిటైజేషన్ కోసమే ఈ నిర్ణయమని ప్రకటించి.. తర్వాత ప్రకటన వచ్చే వరకూ ఉద్యోగులు ఇంటి నుంచే పని చేయాలని కోరింది.
స్వైన్ ఫ్లూకు చెందిన హెచ్ 1 ఎన్ 1 వైరస్ కు సాధారణ జ్వరం, జలుబు, చలి, గొంతు నొప్పి లాంటి లక్షణాలు ఉంటాయి. కానీ.. ఇది ప్రాణాంతకంగా ప్రభావం చూపిన సందర్భాలు గతంలో ఉన్నాయి. అందుకే.. ఏ అవకాశాన్నీ తీసుకోవద్దని సాప్ సంస్థ యాజమాన్యం భావించింది. ఎవరికీ ఈ వైరస్ వ్యాపించకుండా.. గట్టి ముందస్తు చర్యలు తీసుకుంది. ఈ దిశగా.. సిబ్బంది సహకరించాలని కోరగా.. మంచి స్పందన వ్యక్తం అవుతోంది.
ప్రస్తుతం వారాంతం కావడంతో.. మరో మూడు రోజుల వరకూ ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. ఆ తర్వాతే.. ఎప్పటికి తమ కార్యాలయాలను మళ్లీ తెరుస్తారన్న విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.