టీడీపీ ఎమ్మెల్సీలకు నిరాశ…. ఢిల్లీ టూర్ వాయిదా?

శాసనమండలి రద్దు విషయంలో కాస్త సీరియస్ గా వ్యవహరిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై.. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఢిల్లీ స్థాయిలో పోరాటం చేద్దామని వీలైనంతగా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే సీఎం రెండు సార్లు ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను కలిసి రాగా.. టీడీపీ నేతలు కూడా అదే పని చేయాలని ప్రయత్నిస్తున్నారు. తాజాగా.. ఆ పార్టీ ఎమ్మెల్సీలు హస్తినకు వెళ్లి అమిత్ షా ను కలవాలని భావించారట. అలాగే.. ఉప […]

Advertisement
Update:2020-02-18 05:19 IST

శాసనమండలి రద్దు విషయంలో కాస్త సీరియస్ గా వ్యవహరిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై.. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఢిల్లీ స్థాయిలో పోరాటం చేద్దామని వీలైనంతగా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే సీఎం రెండు సార్లు ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను కలిసి రాగా.. టీడీపీ నేతలు కూడా అదే పని చేయాలని ప్రయత్నిస్తున్నారు. తాజాగా.. ఆ పార్టీ ఎమ్మెల్సీలు హస్తినకు వెళ్లి అమిత్ షా ను కలవాలని భావించారట.

అలాగే.. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడునూ కలిసేందుకు నిర్ణయించారట. తాజాగా.. ఢిల్లీ నుంచి అందిన సమాచారం ఏంటంటే.. తెలుగుదేశం ఎమ్మెల్సీలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. అపాయింట్ మెంట్ దక్కలేదట. ముందస్తుగా నిర్ణయమైన కార్యక్రమాల ప్రభావమో.. మరే ఇతర కారణమో తెలియదు కానీ.. షా ను కలిసే అవకాశం దక్కపోవడంపై టీడీపీ ఎమ్మెల్సీలు కాస్త నిరాశకు గురైనట్టు తెలుస్తోంది.

మరోవైపు.. ఉపరాష్ట్రపతి అపాయింట్ మెంట్ ఖరారైనా టీడీపీ ఎమ్మెల్సీలు ఢిల్లీ పర్యటనను వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. అమిత్ షా ను.. కుదిరితే ప్రధాని మోడీని కలిసినప్పుడే ఉపరాష్ట్రపతిని కలవాలని భావిస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. ఈ విషయంలో టీడీపీ నేతలు ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన చేయకున్నా.. ఎప్పుడు కుదిరితే అప్పుడు ఢిల్లీకి వెళ్లి.. మండలి విషయంలో తమ గొంతుక వినిపించాలన్న ఆరాటం వారిలో కనిపిస్తోంది.

వారి ప్రయత్నం ఎంత వరకు సఫలమవుతుందో.. కేంద్రం పెద్దల అపాయింట్ మెంట్ వారికి ఎప్పుడు దక్కుతుందో వేచి చూడాల్సిందే.

Tags:    
Advertisement

Similar News