దటీజ్ కేజ్రీ.... ఈ నిర్ణయం వెరీ క్రేజీ

పేరులోనే ఆమ్ ఆద్మీ ఉంది. ఆ పార్టీని నిజంగా ఆమ్ ఆద్మీనే గెలిపించింది. వరుసగా మూడోసారి కేజ్రీవాల్ ను ముఖ్యమంత్రిని చేస్తోంది. అందుకే.. వారి మద్దతుకు కృతజ్ఞత తెలిపేందుకు దిల్లీ హాట్రిక్ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. క్రేజీ నిర్ణయాన్ని తీసుకున్నారు. తన ప్రమాణ స్వీకారోత్సవానికి యాభై మంది ఆమ్ ఆద్మీలను ప్రత్యేకంగా ఆహ్వానించారు. వేదికపై తనతో వారందరికీ చోటు కూడా కల్పించి గౌరవించనున్నారు. ఈ యాభై మందిలో.. ఆటో, అంబులెన్స్, బస్సు డ్రైవర్లు, పారిశుద్ధ్య కార్మికులు, పాఠశాలల […]

Advertisement
Update:2020-02-16 02:05 IST

పేరులోనే ఆమ్ ఆద్మీ ఉంది. ఆ పార్టీని నిజంగా ఆమ్ ఆద్మీనే గెలిపించింది. వరుసగా మూడోసారి కేజ్రీవాల్ ను ముఖ్యమంత్రిని చేస్తోంది. అందుకే.. వారి మద్దతుకు కృతజ్ఞత తెలిపేందుకు దిల్లీ హాట్రిక్ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. క్రేజీ నిర్ణయాన్ని తీసుకున్నారు. తన ప్రమాణ స్వీకారోత్సవానికి యాభై మంది ఆమ్ ఆద్మీలను ప్రత్యేకంగా ఆహ్వానించారు. వేదికపై తనతో వారందరికీ చోటు కూడా కల్పించి గౌరవించనున్నారు.

ఈ యాభై మందిలో.. ఆటో, అంబులెన్స్, బస్సు డ్రైవర్లు, పారిశుద్ధ్య కార్మికులు, పాఠశాలల ప్యూన్ లు… ఇలా సామాన్యులకు చెందిన వారినే ప్రత్యేకంగా ఎంపిక చేశారు. వారి సమక్షంలోనే ఢిల్లీకి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ విషయాన్ని పార్టీ అగ్రనేత మనీష్ సిసోడియా.. సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇలా.. అట్టడుగు వర్గాల వారి నడుమ గతంలో ఎవరూ ప్రమాణం చేసిన దాఖలాలైతే లేవు.

అందుకే.. కేజ్రీవాల్ నిర్ణయాన్ని అంతా అభినందిస్తున్నారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను, పేదలను గౌరించుకునే తీరు బాగుందని మెచ్చుకుంటున్నారు. మరోవైపు.. ప్రధాని మోదీని కూడా కేజ్రీవాల్ తన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. కానీ.. వారణాసిలో పర్యటించనున్న మోదీ.. ఈ కార్యక్రమానికి సమయాన్ని కేటాయిస్తారో లేదో.. ఇంకా తెలియలేదు. మరి కొన్ని క్షణాల్లో దిల్లీలో జరగనున్న ఈ వేడుకపై.. అందరి దృష్టి నెలకొంది.

Tags:    
Advertisement

Similar News