వైఎస్ జగన్ తరహాలో.... తమిళనాడులో రజినీకాంత్ పాదయాత్ర?
తమిళనాడులో సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ అరంగేట్రంపై చాలా కాలంగా చాలా వార్తలు వస్తూనే ఉన్నాయి. రాజకీయాల్లోకి వస్తానని రెండేళ్ల క్రితం ఆయన చెప్పిన దగ్గర్నుంచీ.. ఇప్పుడు దర్బార్ సినిమా చేసే వరకూ.. రకరకాల గాసిప్స్ పుట్టుకొచ్చాయి. అందులో భాగంగానే వచ్చిందో.. లేదంటే రజినీ సన్నిహితులే ఈ సమాచారాన్ని మీడియాకు లీక్ చేశారో తెలియదు కానీ.. తమిళనాడులో ఓ వార్త మాత్రం బాగా ప్రచారంలో ఉంది. సోషల్ మీడియాలోనూ ఈ విషయమై బాగానే చర్చ జరుగుతోంది. రజినీ […]
తమిళనాడులో సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ అరంగేట్రంపై చాలా కాలంగా చాలా వార్తలు వస్తూనే ఉన్నాయి. రాజకీయాల్లోకి వస్తానని రెండేళ్ల క్రితం ఆయన చెప్పిన దగ్గర్నుంచీ.. ఇప్పుడు దర్బార్ సినిమా చేసే వరకూ.. రకరకాల గాసిప్స్ పుట్టుకొచ్చాయి. అందులో భాగంగానే వచ్చిందో.. లేదంటే రజినీ సన్నిహితులే ఈ సమాచారాన్ని మీడియాకు లీక్ చేశారో తెలియదు కానీ.. తమిళనాడులో ఓ వార్త మాత్రం బాగా ప్రచారంలో ఉంది. సోషల్ మీడియాలోనూ ఈ విషయమై బాగానే చర్చ జరుగుతోంది.
రజినీ రాజకీయాల్లోకి రావడం ఖాయం. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. ఓ యాప్ రూపొందించి తన అనుచర గణాన్ని కూడా సిద్ధం చేసుకుంటున్నారు. ప్రకటన అయితే చేశారు కానీ.. ప్రత్యక్ష రాజకీయాల్లో ఇంకా తొలి అడుగు వేయలేదు. ఆ అడుగు మామూలుగా ఉండకూడదని.. తమిళ రాజకీయాల గతిని మార్చేలా.. దిశను మార్చేలా ఉండాలని రజినీ ప్లాన్ చేస్తున్నారట. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ పాదయాత్ర చేసి జనానికి దగ్గరైన రీతిలో భారీ యాత్ర చేసి.. ఏప్రిల్ లో పార్టీ పెట్టాలని అనుకుంటున్నారట.
ఇదే విషయం.. ఇప్పుడు తమిళనాడు పార్టీల్లో, నాయకుల్లో, ప్రజల్లో.. రజినీ అభిమానుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. జయలలిత తర్వాత.. కమల్ హసన్ లాంటి స్టార్ హీరో పార్టీ పెట్టినా.. ఆయన అంతగా సక్సెస్ కాలేక పోయారు. తర్వాత రజినీ పరిస్థితి కూడా అంతే అని చాలా మంది అనుకున్నారు. కానీ.. పాదయాత్రతో జనాల్లోకి వెళ్లి ఫెయిల్ అయిన నాయకుడు ఎవరూ లేరన్నది.. చరిత్ర చెప్పిన సత్యం. ఆ బాటలో నడిచి.. రజినీ తనది రహదారి అని చెబుతారో.. లేక మరో నిర్ణయంతో రాజకీయాల్లోకి వస్తారో అన్నది.. ఆసక్తికరంగా మారింది.