యువర్ అటెన్షన్ ప్లీజ్.... ఇక రైల్వే స్టేషన్ లలో ఉమ్మేస్తే భారీ జరిమానా

రైల్వే స్టేషన్ లను మరింత పరిశుభ్రంగా ఉంచే దిశగా ఆ శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. స్వచ్ఛ భారత్ అభియాన్ లో భాగంగా ఈ చర్యలను అమలు చేయబోతోంది. ఇకపై.. స్టేషన్లలో ఎవరైనా ఉమ్మేసినా.. ఎక్కడ పడితే అక్కడ మూత్రం పోసినా.. కఠిన చర్యలు తప్పవని.. జరిమానాలు విధించి తీరుతామని తూర్పు కోస్తా రైల్వే ప్రకటించింది. ఇందుకు సంబంధించి జరిమానాల లెక్కలనూ ప్రకటించి.. రైల్వే ప్రయాణికులను ఒక్కసారిగా అలర్ట్ చేసింది. తూర్పు కోస్తా రైల్వే అధికారులు వెల్లడించిన […]

Advertisement
Update:2020-02-08 05:25 IST

రైల్వే స్టేషన్ లను మరింత పరిశుభ్రంగా ఉంచే దిశగా ఆ శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. స్వచ్ఛ భారత్ అభియాన్ లో భాగంగా ఈ చర్యలను అమలు చేయబోతోంది.

ఇకపై.. స్టేషన్లలో ఎవరైనా ఉమ్మేసినా.. ఎక్కడ పడితే అక్కడ మూత్రం పోసినా.. కఠిన చర్యలు తప్పవని.. జరిమానాలు విధించి తీరుతామని తూర్పు కోస్తా రైల్వే ప్రకటించింది. ఇందుకు సంబంధించి జరిమానాల లెక్కలనూ ప్రకటించి.. రైల్వే ప్రయాణికులను ఒక్కసారిగా అలర్ట్ చేసింది.

తూర్పు కోస్తా రైల్వే అధికారులు వెల్లడించిన ప్రకారం.. ఇకపై రైల్వే స్టేషన్లలో.. వాటి ప్రాంగణాల్లో చెత్తా చెదారం పడవేస్తే 100 నుంచి 200 రూపాయలు.. వంట చేస్తే 500.. ఉమ్మితే 200 నుంచి 300.. మూత్రం పోస్తే 300 నుంచి 400.. పక్షులకు, జంతువులకు ఆహారం వెదజల్లితే 300 నుంచి 500.. పాత్రలు కడిగినా, బట్టలు పిండుకున్నా 300 నుంచి 500.. అనుమతి లేకుండా ఎలాంటి వస్తువులు నిల్వ చేసినా 5 వేలు… అనుమతి తీసుకోకుండా పోస్టర్లు అంటిస్తే వెయ్యి నుంచి 2 వేలు.. ఇలా.. రకరకాల తప్పులకు రకరకాల ఫైన్లను.. తూర్పు కోస్తా రైల్వే వసూలు చేయనుంది.

ఈ నెల 10 నుంచే ఈ జరిమానాలు అమల్లోకి రానున్నాయి. తూర్పు కోస్తా రైల్వే పరిధిలోని అన్ని డివిజన్ లలో ఈ నిర్ణయం అమలు కానుంది. అధికారులు కూడా ప్రత్యేక డ్రైవ్ లతో ఈ నిబంధనలను సీరియస్ గా తీసుకోనున్నారు.

స్టేషన్లను స్వచ్ఛంగా ఉంచడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం కాబట్టి.. ప్రయాణికులు కూడా విధిగా తమకు సహకరించాలని కోరుతున్నారు. ఎలాంటి ఫలితాలు ఇస్తుందో చూడాలి.

Tags:    
Advertisement

Similar News