పట్టు వదలని ‘హోదా’మార్కుడు... సీఎం జగన్... ప్రధానికి మళ్లీ విజ్ఞప్తి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనపై… ముఖ్యమంత్రి జగన్.. తన ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నారు. కేంద్రాన్ని వీలైనప్పుడల్లా.. హోదా గురించి ప్రశ్నిస్తూనే ఉంటామని.. ఈ విషయాన్ని వదలబోమని గతంలో చెప్పినట్టే.. మరోసారి ప్రధాని మోడీకి సీఎం జగన్.. హోదా గురించి లేఖ రాశారు. పదిహేనో ఆర్థిక సంఘం నివేదిక రూపంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరారు. రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చే అంశాన్ని కేంద్రం.. గతంలో ఆర్థిక సంఘం సూచనలకు ముడిపెట్టిన […]

Advertisement
Update:2020-02-05 06:08 IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనపై… ముఖ్యమంత్రి జగన్.. తన ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నారు. కేంద్రాన్ని వీలైనప్పుడల్లా.. హోదా గురించి ప్రశ్నిస్తూనే ఉంటామని.. ఈ విషయాన్ని వదలబోమని గతంలో చెప్పినట్టే.. మరోసారి ప్రధాని మోడీకి సీఎం జగన్.. హోదా గురించి లేఖ రాశారు.

పదిహేనో ఆర్థిక సంఘం నివేదిక రూపంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరారు.

రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చే అంశాన్ని కేంద్రం.. గతంలో ఆర్థిక సంఘం సూచనలకు ముడిపెట్టిన విషయం చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు.. అదే ఆర్థిక సంఘం చెప్పిన విషయాన్ని ముఖ్యమంత్రి జగన్.. టచ్ చేశారు.

రాష్ట్రాలకు హోదా కల్పించే సందర్భాల్లో.. కేంద్రానిదే విచక్షణ అని ఆర్థిక సంఘం సిఫారసు చేసిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని అభ్యర్థించారు.

14వ ఆర్థిక సంఘం చెప్పిన విషయాలకు.. 15వ ఆర్థిక సంఘం చెప్పిన విషయాలకు వ్యత్యాసాలు చాలా ఉన్నాయని చెప్పిన జగన్.. ఇప్పుడైనా రాష్ట్రానికి హోదా ఇవ్వాలని.. అది రాష్ట్ర ప్రజల కల, హక్కు అని ప్రధానికి వివరించారు.

మొత్తంగా.. మరోసారి కేంద్రాన్ని హోదా విషయంలో కదిలించే ప్రయత్నం చేసిన జగన్.. తాను చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నానని చెప్పకనే చెప్పారు.

Tags:    
Advertisement

Similar News