రాజధానిపై తొలి సారిగా స్పందించిన కేంద్రం
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం తొలి సారిగా స్పందించింది. ఎక్కడైనా రాజధానిని ఏర్పాటు చేసుకునే వెసులు బాటు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని స్పష్టం చేసింది. లోక్ సభలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ నోటిఫై చేసిందని…. 2015 ఏప్రిల్ 23న అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. […]
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం తొలి సారిగా స్పందించింది. ఎక్కడైనా రాజధానిని ఏర్పాటు చేసుకునే వెసులు బాటు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని స్పష్టం చేసింది. లోక్ సభలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
ఏపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ నోటిఫై చేసిందని…. 2015 ఏప్రిల్ 23న అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లు మీడియా రిపోర్ట్స్ ద్వారానే తెలిసిందని మంత్రి అన్నారు. రాష్ట్ర పరిధిలో ఎక్కడైనా రాజధాని ఏర్పాటు చేసుకునే అధికారం అక్కడి ప్రభుత్వానికి ఉందని మంత్రి స్పష్టం చేశారు.
ఏపీలో పరిపాలనా రాజధానిగా విశాఖ, న్యాయ రాజధానిగా కర్నూలు, శాసన రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం చట్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై అమరావతి ప్రాంతంలో ఆందోళనలు కూడా జరిగాయి. ఇదే విషయాన్ని ఎంపీ జయదేవ్ లోక్‌సభలో ప్రస్తావిస్తే.. కేంద్ర ప్రభుత్వం జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా సమాధానం ఇవ్వడం గమనార్హం.