ముంబై పోలీసులూ... సెహభాష్... మంచి నిర్ణయం తీసుకున్నారు!

ముంబై పోలీసులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర.. వాయు కాలుష్యాన్ని నివారించేందుకు వినూత్నమైన విధానాన్ని అమలు చేస్తున్నారు. సజావుగా వాహనాల రాకపోకలు చేసేందుకూ ఈ విధానాన్ని ఉపయోగిస్తున్నారు. సిగ్నల్స్ దగ్గర అదే పనిగా హారన్ మోగించే వారిని.. తాజా నిర్ణయంతో అదుపు చేస్తున్నారు. రెడ్ సిగ్నల్ పడి.. అది గ్రీన్ గా మారే సమయం దగ్గర పడుతున్న సమయంలో.. వాహనదారులు పదే పదే హారన్ మోగించడాన్ని ఈ చర్యతో నియంత్రిస్తున్నారు. అదేంటంటే.. పోలీసులు ఎవరినీ […]

Advertisement
Update:2020-02-01 06:10 IST

ముంబై పోలీసులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర.. వాయు కాలుష్యాన్ని నివారించేందుకు వినూత్నమైన విధానాన్ని అమలు చేస్తున్నారు. సజావుగా వాహనాల రాకపోకలు చేసేందుకూ ఈ విధానాన్ని ఉపయోగిస్తున్నారు.

సిగ్నల్స్ దగ్గర అదే పనిగా హారన్ మోగించే వారిని.. తాజా నిర్ణయంతో అదుపు చేస్తున్నారు. రెడ్ సిగ్నల్ పడి.. అది గ్రీన్ గా మారే సమయం దగ్గర పడుతున్న సమయంలో.. వాహనదారులు పదే పదే హారన్ మోగించడాన్ని ఈ చర్యతో నియంత్రిస్తున్నారు.

అదేంటంటే.. పోలీసులు ఎవరినీ శిక్షించరు. ఎవరినీ అదుపులోకి తీసుకోరు. ఎందుకు పదే పదే హారన్ మోగిస్తున్నారని ప్రశ్నించరు. కానీ.. వాహనదారులు హారన్ మోగిస్తే.. అది ఎంత డెసిబెల్స్ లో ఉందో లెక్కిస్తారు. ఇందుకోసం ఓ ప్రత్యేకమైన పరికరాన్ని జనం ఎక్కువ ఉన్న కూడళ్లలో ఏర్పాటు చేస్తున్నారు. డెసిబల్ మీటర్లుగా పేరున్న వీటితో.. హారన్ తీవ్రతను లెక్కిస్తారు. 85 డెసిబుల్స్ దాటేంతగా.. హారన్ మోగిస్తే మాత్రం.. మరోసారి రెడ్ లైట్ వేస్తారు. ఇంకో 90 సెకన్లు వాహనాలన్నీ నిలిపేస్తారు.

ఇలా చేయడం వల్ల.. హారన్ మోగించే వారికే కాదు.. ఇతర వాహనదారులకూ ఇబ్బందులు తప్పవు. అందుకే.. ఒకరికి ఒకరు సమన్వయం చేసుకుంటూ.. తాము ఇబ్బంది పడకుండా.. ఎదుటివారిని ఇబ్బందిపెట్టకుండా హారన్ మోగించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇదే.. ముంబై వాసుల్లో కాస్త మార్పును తెస్తోంది.

ఈ విధానంపై.. తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. హైదరాబాద్ లోనూ అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. డీజీపీకి ట్యాగ్ చేస్తూ.. విషయాన్ని నివేదించారు. కానీ.. ఇలాంటి విధానంతో.. ట్రాఫిక్ లో జనాలు ఎక్కువగా నిలిచిపోతే.. ఇబ్బందులు మాత్రం తప్పవు. అలాగే.. ట్రాఫిక్ లో చిక్కుకున్న వాళ్లలో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నా… అంబులెన్స్ లు నిలిచినా సమస్యలు తప్పవు.

ఇలాంటి సమస్యలు రాకుండా.. తాజా విధానాన్ని అమలు చేస్తే మాత్రం.. ముంబై పోలీసులు ట్రాఫిక్ విషయంలో మంచి చర్య తీసుకున్నట్టుగా అందరూ భావించవచ్చు.

Tags:    
Advertisement

Similar News