జగన్‌ను కలిసిన జస్టిస్ జాస్తి చలమేశ్వర్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ గురువారం నాడు ఆయన కార్యాలయంలో కలిశారు. చలమేశ్వర్‌తో పాటు నర్సరావుపేట పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీకృష్ణ దేవరాయులు, ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఉన్నారు. తనను కలిసిన చలమేశ్వర్ కు సీఎం జగన్ శాలువా కప్పి సత్కరించారు. న్యాయమూర్తి కాకముందు జాస్తి చలమేశ్వర్ తెలుగుదేశం పార్టీలో చాలా కీలకమైన వ్యక్తి. స్వర్గీయ ఎన్టీరామారావుకు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి అత్యంత […]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ గురువారం నాడు ఆయన కార్యాలయంలో కలిశారు. చలమేశ్వర్‌తో పాటు నర్సరావుపేట పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీకృష్ణ దేవరాయులు, ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఉన్నారు.
తనను కలిసిన చలమేశ్వర్ కు సీఎం జగన్ శాలువా కప్పి సత్కరించారు.
న్యాయమూర్తి కాకముందు జాస్తి చలమేశ్వర్ తెలుగుదేశం పార్టీలో చాలా కీలకమైన వ్యక్తి. స్వర్గీయ ఎన్టీరామారావుకు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి అత్యంత సన్నిహితులు. తెలుగుదేశం పార్టీ అభివృద్ధికోసం జాస్తి చలమేశ్వర్ చేసిన కృషి చాలాగొప్పది.
అలాంటి జాస్తి చలమేశ్వర్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలవడంలో ఆంతర్యం ఏమై ఉంటుంది? అని కొందరు రాజకీయ విశ్లేషకులు ఊహాగానాలు చేస్తున్నారు.