మండలి కథ... ఇక్కడ ముగిసింది... అక్కడే మిగిలింది!

శాసనమండలి రద్దును ఆమోదిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ చేసిన తీర్మానం.. కేంద్రానికి చేరింది. శాసనసభలో జరిగిన పరిణామాలను.. నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు క్రోడీకరించారు. అనంతరం ప్రభుత్వ అనుమతితో.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు తీర్మానాన్ని చేరవేశారు. ఈ ప్రక్రియతో.. దాదాపుగా శాసనమండలి రద్దు ప్రక్రియ రాష్ట్రానికి సంబంధించినంత వరకూ ముగిసింది. ఈ విషయంపై అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం నడిచినా.. చివరికి ప్రభుత్వం తను అనుకున్న పనిని మాత్రం పూర్తి చేసింది. ప్రజలకు మేలు చేసే […]

Advertisement
Update:2020-01-29 06:36 IST

శాసనమండలి రద్దును ఆమోదిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ చేసిన తీర్మానం.. కేంద్రానికి చేరింది. శాసనసభలో జరిగిన పరిణామాలను.. నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు క్రోడీకరించారు. అనంతరం ప్రభుత్వ అనుమతితో.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు తీర్మానాన్ని చేరవేశారు. ఈ ప్రక్రియతో.. దాదాపుగా శాసనమండలి రద్దు ప్రక్రియ రాష్ట్రానికి సంబంధించినంత వరకూ ముగిసింది.

ఈ విషయంపై అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం నడిచినా.. చివరికి ప్రభుత్వం తను అనుకున్న పనిని మాత్రం పూర్తి చేసింది. ప్రజలకు మేలు చేసే బిల్లులను అడ్డుకుంటున్నారు కాబట్టే.. ఏడాదికి 60 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అవుతోంది కాబట్టే… ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం సభలోనూ, సభ బయటా వివరిస్తూ వస్తోంది. ఈ చర్చోపచర్చలు ఎలా ఉన్నా.. కేంద్రం ఈ తీర్మానాన్ని ఏం చేయనుందన్నది ఉత్కంఠగా మారింది.

త్వరలోనే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా.. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు ప్రతిపాదనను.. కేంద్రం వెంటనే సభ ముందుకు తెస్తుందా? తేదా?.. అన్నది చర్చనీయాంశంగా మారింది. కేంద్ర నిర్ణయాన్ని బట్టే.. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి మనుగడ ఆధారపడి ఉంది. ప్రస్తుతానికి దేశంలో ఐదారు రాష్ట్రాల్లో తప్ప… ఎక్కడా శాసన మండలి లేదు. ఆర్థిక భారం దృష్ట్యా.. వాటిని రాష్ట్రాలు రద్దు చేసుకున్నాయి.

ఈ నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే వాదనతో మండలి రద్దుకు నిర్ణయించి అసెంబ్లీలో తీర్మానం పెట్టగా.. సభ ఆ తీర్మానాన్ని ఆమోదించింది. అది కేంద్రం చేతికి చేరింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీసుకునే నిర్ణయం పైనే.. తదుపరి పరిణామాలు ఆధారపడి ఉన్నాయి.

Tags:    
Advertisement

Similar News