ఏపీ శాసనమండలి రద్దుకు కేబినెట్ ఆమోదం
ఏపీ సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ మాట నెగ్గని శాసనమండలిని ఏకంగా రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఉదయం 10 గంటలకు ప్రారంభమైన కేబినెట్ భేటీలోనే సీఎం జగన్ శాసనమండలిని రద్దు చేయాలన్న నిర్ణయానికి ఆమోదం తెలుపడం సంచలనంగా మారింది. ఉదయం 11 గంటలకు మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మండలి రద్దు తీర్మానాన్ని శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. శాసనమండలిని ఎన్టీ రామారావు ప్రభుత్వం రద్దు చేసింది. వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చిన కొత్తలో తీసుకొచ్చిన […]
ఏపీ సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ మాట నెగ్గని శాసనమండలిని ఏకంగా రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఉదయం 10 గంటలకు ప్రారంభమైన కేబినెట్ భేటీలోనే సీఎం జగన్ శాసనమండలిని రద్దు చేయాలన్న నిర్ణయానికి ఆమోదం తెలుపడం సంచలనంగా మారింది. ఉదయం 11 గంటలకు మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మండలి రద్దు తీర్మానాన్ని శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు.
శాసనమండలిని ఎన్టీ రామారావు ప్రభుత్వం రద్దు చేసింది. వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చిన కొత్తలో తీసుకొచ్చిన శాసనమండలిని ఆయన కుమారుడు జగన్ రద్దు చేస్తుండడం విశేషంగా మారింది. మండలి రద్దుపై అసెంబ్లీ తీర్మానం చేసి పార్లమెంట్ కు పంపనున్నారు. పార్లమెంట్ ఆమోదం పొందితే ఏపీ శాసనమండలి రద్దు అవుతుంది.
ఏపీ శాసనమండలిలో వైసీపీకి బలం లేదు. టీడీపీ కి ఎక్కువ బలం ఉండడంతో మండలిలో బిల్లులను అడ్డుకుంటోంది. మండలి రద్దుతో టీడీపీ ఆధిపత్యానికి చెక్ పెట్టాలని యోచిస్తోంది. వైఎస్ జగన్ కేబినెట్ లో డిప్యూటీ సీఎంగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మత్య్స శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణలు శాసనమండలి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో వీరు ఓడిపోవడంతో జగన్ ఎమ్మెల్సీలను చేసి మరీ వీరికి మంత్రి పదవులు ఇచ్చారు. అయితే మండలి రద్దైతే పిల్లి సుభాష్, మోపిదేవిల మంత్రి పదవులు కోల్పోనున్నారు. అయితే జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని.. మండలి రద్దు అయితే తమ పదవులకు రాజీనామా చేసేందుకు వీరిద్దరు రెడీ అయినట్లు సమాచారం.