లోకేష్... మంచి అవకాశాన్ని మిస్ చేసుకుంటున్నట్టేనా?

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పుత్ర రత్నం.. మాజీ మంత్రి, యువ నాయకుడు… తెలుగుదేశం ఆశా కిరణం. ఈ నాలుగైదు మాటలు చాలు.. తెలుగుదేశం పార్టీలో లోకేష్ బాబు హవా తెలియజేయడానికి. కానీ… ఆ స్థాయిలో లోకేష్ రాజకీయాలు చేస్తున్నారా… తండ్రికి తగిన తనయుడిగా ఎదుగుతున్నారా… అంటే… కాదనే చెబుతారు చాలా మంది. ఇది సహజంగానే… చంద్రబాబుపైనా ప్రభావం చూపిస్తోంది. పార్టీని తర్వాత ముందుకు తీసుకుపోయేదెవరన్న చర్చ… పార్టీలోనూ జోరుగా కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితిలో.. […]

Advertisement
Update:2020-01-22 06:07 IST

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పుత్ర రత్నం.. మాజీ మంత్రి, యువ నాయకుడు… తెలుగుదేశం ఆశా కిరణం. ఈ నాలుగైదు మాటలు చాలు.. తెలుగుదేశం పార్టీలో లోకేష్ బాబు హవా తెలియజేయడానికి. కానీ… ఆ స్థాయిలో లోకేష్ రాజకీయాలు చేస్తున్నారా… తండ్రికి తగిన తనయుడిగా ఎదుగుతున్నారా… అంటే… కాదనే చెబుతారు చాలా మంది. ఇది సహజంగానే… చంద్రబాబుపైనా ప్రభావం చూపిస్తోంది. పార్టీని తర్వాత ముందుకు తీసుకుపోయేదెవరన్న చర్చ… పార్టీలోనూ జోరుగా కొనసాగుతోంది.

ఇలాంటి పరిస్థితిలో.. లోకేశ్ తనను తాను నిరూపించుకునే అవకాశాన్ని చేజేతులా పాడు చేసుకుంటున్న విషయం.. పార్టీ కేడర్ లోనూ చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు కూడా.. అమరావతి పోరాటాన్ని చంద్రబాబే తన భుజంపై మోస్తుండడం.. ఊరూ వాడా పర్యటనలు చేస్తుండడం చూస్తుంటే.. లోకేశ్ బాబు రాజకీయంగా అంత ఎదగలేదన్నది వాస్తవమే అనే చర్చ జనాల్లోనూ వినిపిస్తోంది.

ఇటీవలి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూసాలు కదిలిపోయేలా ఫలితాలు.. వైసీపీని బలపరిచాయి. జగన్ నాయకత్వం ముందు చంద్రబాబు అనుభవం ఎందుకూ పనికిరాకుండా పోయింది. ఇదే కదా.. సవాల్ గా తీసుకునే సందర్భం.. ఇదే కదా నాయకత్వ పటిమను నిరూపించుకునే అవకాశం.. ఇదే కదా తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టి నాయకుడిగా పార్టీని నడిపించే సదవకాశం. కానీ.. ఇదేదీ లోకేశ్ కు పట్టినట్టు కనిపించడం లేదు.

ఇలాంటి పరిస్థితుల్లో.. అవకాశాన్ని ఒకరు ఇవ్వరు.. మనమే తీసుకోవాలి.. నాయకుడిగా నిరూపించుకుని.. భవిష్యత్ నేతగా ఎదిగే పరిస్థితులు సృష్టించుకోవాలి.. అన్న వాస్తవాన్ని లోకేశ్ ఏ మాత్రం గ్రహించడం లేదు. ఫలితంగా.. పార్టీ భారమంతా మళ్లీ మళ్లీ పెద్దాయన చంద్రబాబుపైనే పడుతోంది. ఈ ఫలితం.. అమరావతి కోసం చేస్తున్న పోరాటంలో స్పష్టంగా కనిపిస్తోంది. మరి.. లోకేశ్ ఎప్పుడు మారతారో.. పార్టీకి భవిష్యత్ ఆశాకిరణంగా ఎప్పుడు తయారవుతారో!

Tags:    
Advertisement

Similar News