రాజ్ కోట వన్డేలో రాజా భారత్

కంగారూలను దెబ్బకు దెబ్బతీసిన విరాట్ సేన భారత్- ఆస్ట్ర్రేలియాజట్ల తీన్మార్ వన్డే సిరీస్ నువ్వానేనా అన్నట్లుగా సాగుతోంది. ఆరునూరైనా నెగ్గితీరాల్సిన రెండోవన్డేలో భారత్ 36 పరుగుల విజయం సాధించడంతో సిరీస్ రసపట్టుగా మారింది. రాజ్ కోట లోని సౌరాష్ట్ర్ర క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా ముగిసిన డూ ఆర్ డై రెండో వన్డేలో ఆతిథ్య భారత్ 36 పరుగులతో నెగ్గి సిరీస్ లో 1-1తో సమఉజ్జీగా నిలిచింది. టాస్ ఓడినా 340 స్కోరు…. బ్యాటింగ్ కు స్వర్గధామం లాంటి రాజ్ […]

Advertisement
Update:2020-01-18 02:32 IST
  • కంగారూలను దెబ్బకు దెబ్బతీసిన విరాట్ సేన

భారత్- ఆస్ట్ర్రేలియాజట్ల తీన్మార్ వన్డే సిరీస్ నువ్వానేనా అన్నట్లుగా సాగుతోంది. ఆరునూరైనా నెగ్గితీరాల్సిన రెండోవన్డేలో భారత్ 36 పరుగుల విజయం సాధించడంతో సిరీస్ రసపట్టుగా మారింది.

రాజ్ కోట లోని సౌరాష్ట్ర్ర క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా ముగిసిన డూ ఆర్ డై రెండో వన్డేలో ఆతిథ్య భారత్ 36 పరుగులతో నెగ్గి సిరీస్ లో 1-1తో సమఉజ్జీగా నిలిచింది.

టాస్ ఓడినా 340 స్కోరు….

బ్యాటింగ్ కు స్వర్గధామం లాంటి రాజ్ కోట వికెట్ పై ముందుగా కీలకటాస్ నెగ్గిన కంగారూ కెప్టెన్ ఫించ్…చేజింగ్ కే మొగ్గు చూపడం ద్వారా…భారత్ ను బ్యాటింగ్ చేయమని కోరాడు.

ఓపెనర్లు రోహిత్- ధావన్ మొదటి వికెట్ కు 81 పరుగుల భాగస్వామ్యంతో చక్కటి ఆరంభాన్ని ఇచ్చారు. రోహిత్ 42, ధావన్ 96, కొహ్లీ 78, రాహుల్ 80 పరుగుల స్కోర్లతో చెలరేగిపోడంతో భారత్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 340 పరుగుల భారీస్కోరు సాధించింది. ఆస్ట్ర్రేలియా బౌలర్లలో లెగ్ స్పిన్నర్ ఆడం జంపా 3వికెట్లు పడగొట్టాడు.

స్మిత్ ఒంటరిపోరాటం వృధా…

341 పరుగుల భారీ లక్ష్యంతో చేజింగ్ కు దిగిన కంగారూజట్టు తుదివరకూ పోరాడింది. మాజీ కెప్టెన్, వన్ డౌన్ ఆటగాడు స్టీవ్ స్మిత్ 102 బాల్స్ లో 9 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో 38వ ఓవర్ వరకూ పోరాడినా…చివరకు 98 పరుగుల స్కోరుకు స్పిన్నర్ కుల్దీప్ బౌలింగ్ లో అవుట్ కావడంతో భారత్ విజయానికి మార్గం సుగమయ్యింది.

ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ 3 వికెట్లు, జడేజా, కుల్దీప్ చెరో రెండు వికెట్లు, బుమ్రా, సైనై చెరో వికెట్ పడగొట్టడంతో… ఆస్ట్ర్రేలియా 49.1 ఓవర్లలో 304 పరుగులకే ఆలౌటయ్యింది.

దీంతో భారత్ 36 పరుగుల విజయంతో ఊపిరిపీల్చుకొంది. సిరీస్ విజయావకాశాలను సజీవంగా నిలుపుకోగలిగింది.

భారత్ విజయంలో ప్రధానపాత్ర వహించిన వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రాహుల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సిరీస్ లోని నిర్ణయాత్మక ఆఖరి వన్డే.. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా 19న జరుగుతుంది.

Tags:    
Advertisement

Similar News