2020 సీజన్లో భారత్ తొలి టీ-20 నేడే
గౌహతి వేదికగా శ్రీలంకతో సూపర్ సండే పైట్ టీ-20 ప్రపంచకప్ కు సన్నాహాలలో భాగంగా మాజీ చాంపియన్ భారత్… 2020 సీజన్లో తన మొట్టమొదటి టీ-20 సిరీస్ కు పూర్తిస్థాయిలో సిద్ధమయ్యింది. శ్రీలంకతో తీన్మార్ సిరీస్ లోని తొలి టీ-20 మ్యాచ్ లో 7వ ర్యాంకర్ శ్రీలంకతో తలపడటానికి విరాట్ కొహ్లీ నాయకత్వంలో బరిలోకి దిగుతోంది. గౌహతీలోని బారస్పారా స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఐసీసీ టీ-20 తాజా ర్యాంకింగ్స్ ప్రకారం భారత్ 5వ ర్యాంక్ లోను, […]
- గౌహతి వేదికగా శ్రీలంకతో సూపర్ సండే పైట్
టీ-20 ప్రపంచకప్ కు సన్నాహాలలో భాగంగా మాజీ చాంపియన్ భారత్… 2020 సీజన్లో తన మొట్టమొదటి టీ-20 సిరీస్ కు పూర్తిస్థాయిలో సిద్ధమయ్యింది.
శ్రీలంకతో తీన్మార్ సిరీస్ లోని తొలి టీ-20 మ్యాచ్ లో 7వ ర్యాంకర్ శ్రీలంకతో తలపడటానికి విరాట్ కొహ్లీ నాయకత్వంలో బరిలోకి దిగుతోంది. గౌహతీలోని బారస్పారా స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది.
ఐసీసీ టీ-20 తాజా ర్యాంకింగ్స్ ప్రకారం భారత్ 5వ ర్యాంక్ లోను, శ్రీలంక 7వ ర్యాంకులోనూ కొనసాగుతున్నాయి. విరాట్ కొహ్లీ నాయకత్వంలో భారత్, యార్కర్ల కింగ్ లాసిత్ మలింగ కెప్టెన్సీలో శ్రీలంక సై అంటే సై అంటున్నాయి.
హాట్ ఫేవరెట్ భారత్….
భారత జట్టు ఓపెనింగ్ జోడీగా ధావన్- రాహుల్ బ్యాటింగ్ కు దిగనున్నారు. బౌలింగ్ లో బుమ్రా, నవదీప్ సైనీ, శార్ధూల్ ఠాకూర్ కీలకపాత్ర పోషించనున్నారు.
మరోవైపు…లాసిత్ మలింగ నాయకత్వంలోని శ్రీలంకజట్టు పలువురు యువఆటగాళ్లతో సమరానికి సిద్దమయ్యింది. భారత్ కు గట్టిపోటీ ఇవ్వాలన్న పట్టుదలతో ఉంది.
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు…
కేంద్రప్రభుత్వం ఇటీవలే ఆమోదం తెలిపిన పౌరసత్వబిల్లు సవరణకు వ్యతిరేకంగా అసోంలో నిరసన వ్యక్తం కావడంతో…ఎలాంటి అల్లర్లు జరుగకుండా మ్యాచ్ కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
మొత్తం మూడువేలమంది పోలీసు దళాలను మొహరించారు. రెండుజట్లు విడిది చేసిన హోటల్ దగ్గర కట్టుదిట్టమైన భద్రత కల్పించారు.
రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ ను విజయంతో ఆరంభించాలని రెండుజట్లూ భావిస్తున్నాయి. శ్రీలంకతో పోల్చిచూస్తే భారతజట్టు స్థానబలంతో పాటు అన్ని విభాగాలలోనూ సమతూకంతో ఉండటం విశేషం.