స్విగ్గీలో... ఇక ఆఫర్లు కష్టమే?

రోజు రోజు కి బతుకులు బిజీ అయిపోతున్నాయి. ముఖ్యంగా భార్యా భర్తలు ఇద్దరూ ఉద్యోగం చేస్తుంటే ఇక వారి జీవితం మరీ ఇబ్బందిగా మారుతోంది. వాళ్లకి కనీసం వంట చేసుకునే తీరిక, ఓపికా లేకుండా పోతున్నది. ఇటువంటివారికి ఆన్ లైన్ ద్వారా కావలసిన ఆహారాన్ని తెప్పించుకోవడానికి అవకాశం ఉండడం వరంగా మారింది. ఆన్ లైన్ లో ఆహారాన్ని ఆర్డర్ చేస్తే ఇంటికే భోజనం వస్తుంది. పైగా రెస్టారెంట్ కంటే తక్కువ ధరకే లభిస్తుంది. ఎందుకంటే ఫుడ్ డెలివరీ […]

Advertisement
Update:2020-01-04 02:38 IST

రోజు రోజు కి బతుకులు బిజీ అయిపోతున్నాయి. ముఖ్యంగా భార్యా భర్తలు ఇద్దరూ ఉద్యోగం చేస్తుంటే ఇక వారి జీవితం మరీ ఇబ్బందిగా మారుతోంది. వాళ్లకి కనీసం వంట చేసుకునే తీరిక, ఓపికా లేకుండా పోతున్నది. ఇటువంటివారికి ఆన్ లైన్ ద్వారా కావలసిన ఆహారాన్ని తెప్పించుకోవడానికి అవకాశం ఉండడం వరంగా మారింది.

ఆన్ లైన్ లో ఆహారాన్ని ఆర్డర్ చేస్తే ఇంటికే భోజనం వస్తుంది. పైగా రెస్టారెంట్ కంటే తక్కువ ధరకే లభిస్తుంది. ఎందుకంటే ఫుడ్ డెలివరీ చేసే కంపెనీలు ప్రతి ఆర్డర్ పై ఎదో ఒక ఆఫర్ ప్రకటిస్తూనే ఉంటాయి. అందుకే సమాజం లోని అన్ని వర్గాలవారిని ఈ ఆఫర్లతో ఆకర్షిస్తున్నాయి. అయితే త్వరలో ఆన్ లైన్ ఆర్డర్ ద్వారా తెప్పించుకునే ఆహారం ధర పెరగనున్నదట.

ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ రంగంలో ప్రధానంగా స్విగ్గి, జొమాటో ల మధ్యే పోటీ ఉంది. అందుకే ఒకదానిని మించి మరో కంపెనీ ఆఫర్లు ప్రకటించి కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. అయితే, ఇకపై అలా కుదరకపోవచ్చు. ఎందుకంటే స్విగ్గి త్వరలోనే ఫుడ్ డెలివరీ చార్జీలను పెంచబోతోందంట. అలాగే రెస్టారెంట్ల నుంచి వసూలు చేసే కమిషన్ కూడా పెంచబోతున్నట్లు సమాచారం.

అదే జరిగితే స్విగ్గి నుంచి ఫుడ్ ఆర్డర్ చేసిన ప్రతి ఆర్డర్ పైనా కొంత ఎక్కువ మొత్తంలో డెలివరీ చార్జీలు చెల్లించాల్సి వస్తుందట. అలాగే హోటల్ నుంచి వచ్చే ఫుడ్ పై డిస్కౌంట్ లు, ఆఫర్లు కూడా ఉండకపోవచ్చు.

బెంగళూరు కేంద్రంగా సేవలు అందించే స్విగ్గి … ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ రంగంలో మార్కెట్ లీడర్. అయితే అయిదేళ్ల నుంచి వ్యాపారంలో ఉన్నా నష్టాల్లోనే ఉందట. కంపెనీలో పెట్టుబడి పెట్టిన వాటాదార్లు లాభాల గురించి ఒత్తిడి ఎక్కువ చేయడం తో స్విగ్గి ధరలు పెంచే ఆలోచన చేస్తున్నదట.

ఇదే జరిగితే జొమాటో వంటి ప్రత్యర్థి కంపెనీలు ఊరుకుంటాయా…. అవి కూడా తమ సేవల రుసుము పెంచేస్తాయి. కాబట్టి ఆన్ లైన్ లో ఆర్డర్లు ఇచ్చే ఆహార ప్రియులు ఈ సంగతిని గుర్తుంచుకోవాలి మరి…!

Tags:    
Advertisement

Similar News