ఏపీ రాజధానిపై హరీష్‌రావుకు కౌంటర్ ఇచ్చిన ఐవైఆర్
హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన హరీష్ రావు… ఏపీని కాస్త హేళన చేసేలా మాట్లాడారు. హైదరాబాద్ కీర్తిని చెప్పుకునే వరకు పరిమితం కాకుండా… దేశంలోని మిగిలిన నగరాల్లో లోపాలున్నాయని వ్యాఖ్యానించారు. ముంబైకి మూడు వైపులా సముద్రం, ఢిల్లీలో కాలుష్యం, బెంగళూరులో ట్రాఫిక్, చెన్నైలో నీటి కొరత ఉన్నాయి. ఎలాంటి ఇబ్బందులు లేని నగరం హైదరాబాద్ మాత్రమేనన్నారు. అంతటితో ఆగకుండా నిన్న, ఇవాలా ఏపీలో జరుగుతున్న పరిణామాలు కూడా… హైదరాబాద్‌కు మేలు చేస్తున్నాయంటూ హేళనగా నవ్వారు. ఏపీలోని […]
హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన హరీష్ రావు… ఏపీని కాస్త హేళన చేసేలా మాట్లాడారు. హైదరాబాద్ కీర్తిని చెప్పుకునే వరకు పరిమితం కాకుండా… దేశంలోని మిగిలిన నగరాల్లో లోపాలున్నాయని వ్యాఖ్యానించారు. ముంబైకి మూడు వైపులా సముద్రం, ఢిల్లీలో కాలుష్యం, బెంగళూరులో ట్రాఫిక్, చెన్నైలో నీటి కొరత ఉన్నాయి. ఎలాంటి ఇబ్బందులు లేని నగరం హైదరాబాద్ మాత్రమేనన్నారు.
అంతటితో ఆగకుండా నిన్న, ఇవాలా ఏపీలో జరుగుతున్న పరిణామాలు కూడా… హైదరాబాద్‌కు మేలు చేస్తున్నాయంటూ హేళనగా నవ్వారు. ఏపీలోని పరిణామాలు… హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మంచి చేస్తాయంటూ వ్యాఖ్యానించారు.
ఇలా మాట్లాడిన హరీష్‌రావుకు మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు కౌంటర్ ఇచ్చారు. హరీష్‌రావు అంచనా పొరపాటు అని కృష్ణారావు వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్‌లో అనిశ్చితి హైదరాబాద్‌కు స్వల్పకాలం మాత్రమే లాభిస్తుందని వ్యాఖ్యానించారు. విశాఖపట్నం పరిపాలన రాజధానిగా కాస్త కుదుటపడితే పరిస్థితి మరోలా ఉంటుందని కౌంటర్ ఇచ్చారు.
విశాఖ రాజధానిగా అభివృద్ధి చెందితే హైదరాబాద్, బెంగళూరులను తలదన్నే నగరంగా విశాఖ నిలుస్తుందన్నారు. తూర్పు తీరంలో ముంబైని తలదన్నే ధీటైన నగరంగా విశాఖపట్నం నిలుస్తుందని ఐవైఆర్ కృష్ణారావు ధీమా వ్యక్తం చేశారు.
ఏపీలో నెలకొన్న అనిశ్చితి ఎక్కువ రోజులు కొనసాగదని, త్వరలోనే దానికి తెర పడుతుందని అన్నారు. ఈ దిశగా ఏపీ ప్రభుత్వం త్వరితగతిన చర్యలను తీసుకుంటోందని వ్యాఖ్యానించారు.