దశాబ్దకాలపు అత్యుత్తమ క్రికెటర్ కొహ్లీ
విజ్ డెన్ లో మరోసారి విరాట్ కు చోటు క్రికెట్ బైబిల్ విజ్ డెన్ అల్మానాక్ లో.. భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ మరోసారి చోటు సంపాదించాడు. విజ్ డెన్ ఎంపిక చేసిన గత దశాబ్దకాలపు ఐదుగురు అత్యుత్తమ క్రికెటర్లలో విరాట్ కొహ్లీ సైతం చోటు సంపాదించాడు. విజ్ డెన్ ప్రకటించిన ఐదుగురు అత్యుత్తమ క్రికెటర్లలో సఫారీజోడీ ఏబీ డివిలియర్స్, డేల్ స్టెయిన్, ఆస్ట్ర్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, కంగారూ మహిళ క్రికెట్ ఆల్ రౌండర్ ఎల్సీ పెర్రీ […]
- విజ్ డెన్ లో మరోసారి విరాట్ కు చోటు
క్రికెట్ బైబిల్ విజ్ డెన్ అల్మానాక్ లో.. భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ మరోసారి చోటు సంపాదించాడు. విజ్ డెన్ ఎంపిక చేసిన గత దశాబ్దకాలపు ఐదుగురు అత్యుత్తమ క్రికెటర్లలో విరాట్ కొహ్లీ సైతం చోటు సంపాదించాడు.
గత దశాబ్దకాలంలో క్రికెట్ మూడుఫార్మాట్లలోనూ అత్యంత నిలకడగా రాణించిన ఏకైక క్రికెటర్ విరాట్ కొహ్లీ మాత్రమే. టెస్ట్ క్రికెట్లో 7 వేల 202 పరుగులు, వన్డే క్రికెట్లో 27 శతకాలతో సహా 11 వేల 125 పరుగులు, టీ-20 క్రికెట్లో 2 వేల 633 పరుగులు సాధించిన రికార్డు కొహ్లీకి ఉంది.
ఈ మూడు ఫార్మాట్లలోను కొహ్లీ 50కి పైగా సగటు నమోదు చేయడం విశేషం. 2017లో విజ్ డెన్ క్రికెటర్ గా ఎంపికైన 31 సంవత్సరాల విరాట్ కొహ్లీ… గత పది సంవత్సరాల అత్యుత్తమ క్రికెటర్ గా కూడా విజ్ డెన్ గౌరవం పొందటం విశేషం.