విశాఖ బెస్ట్‌... పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహంగా వస్తారు...

విశాఖను పరిపాలన రాజధానిగా ఎంపిక చేయడాన్ని కాంగ్రెస్ నేత టి. సుబ్బరామిరెడ్డి స్వాగతించారు. పరిపాలన రాజధానిగా విశాఖపట్నం చాలా అనువైన ప్రాంతమని వ్యాఖ్యానించారు. విశాఖలో రాజధాని పెట్టడం వల్ల రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. విశాఖలో చాలా భూములున్నాయని… నగర విస్తరణకు చాలా అనుకూలంగా ఉంటాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత విశాఖపట్నమే అతిపెద్ద నగరమని గుర్తు చేశారు. విశాఖకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చి మరింత అభివృద్ధి చేస్తే అద్బుతమైన రాజధానిగా నిలుస్తుందన్నారు. విశాఖపట్నం పారిశ్రామికవేత్తలకు ఎంతో పరిచయం […]

Advertisement
Update:2019-12-27 06:09 IST

విశాఖను పరిపాలన రాజధానిగా ఎంపిక చేయడాన్ని కాంగ్రెస్ నేత టి. సుబ్బరామిరెడ్డి స్వాగతించారు. పరిపాలన రాజధానిగా విశాఖపట్నం చాలా అనువైన ప్రాంతమని వ్యాఖ్యానించారు. విశాఖలో రాజధాని పెట్టడం వల్ల రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

విశాఖలో చాలా భూములున్నాయని… నగర విస్తరణకు చాలా అనుకూలంగా ఉంటాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత విశాఖపట్నమే అతిపెద్ద నగరమని గుర్తు చేశారు. విశాఖకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చి మరింత అభివృద్ధి చేస్తే అద్బుతమైన రాజధానిగా నిలుస్తుందన్నారు.

విశాఖపట్నం పారిశ్రామికవేత్తలకు ఎంతో పరిచయం ఉన్న ప్రాంతమని… అలాంటి నగరాన్ని పరిపాలన రాజధానిగా చేస్తే ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు మరింత ఉత్సాహంగా ముందుకొస్తారన్నారు.

Tags:    
Advertisement

Similar News