లవర్ బాయ్ కు మళ్లీ బ్యాడ్ లక్ తప్పలేదు

ఓ సినిమా ఫ్లాప్ అయిందని లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. అలా ఏడాదికి పైగా గ్యాప్ తీసుకొని మరో సినిమా చేస్తే, మళ్లీ ఫ్లాప్ వచ్చింది. ఇది రాజ్ తరుణ్ పరిస్థితి. ఎప్పుడో 2018 జులైలో లవర్ అనే సినిమా చేశాడు. మళ్లీ ఇన్నాళ్లకు ఇద్దరిలోకం ఒకటే అనే సినిమా చేశాడు. ఈ సినిమా కూడా ఫ్లాప్ అవ్వడంతో రాజ్ తరుణ్ కెరీర్ ఇప్పుడు మరింత కష్టాల్లో పడింది. జీఆర్ కృష్ణ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా […]

Advertisement
Update:2019-12-27 02:43 IST

ఓ సినిమా ఫ్లాప్ అయిందని లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. అలా ఏడాదికి పైగా గ్యాప్ తీసుకొని మరో సినిమా చేస్తే, మళ్లీ ఫ్లాప్ వచ్చింది. ఇది రాజ్ తరుణ్ పరిస్థితి. ఎప్పుడో 2018 జులైలో లవర్ అనే సినిమా చేశాడు. మళ్లీ ఇన్నాళ్లకు ఇద్దరిలోకం ఒకటే అనే సినిమా చేశాడు. ఈ సినిమా కూడా ఫ్లాప్ అవ్వడంతో రాజ్ తరుణ్ కెరీర్ ఇప్పుడు మరింత కష్టాల్లో పడింది.

జీఆర్ కృష్ణ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏమాత్రం ఆకట్టుకోలేదు. నిజానికి ఇదొక టర్కీ రీమేక్ సినిమా. ఒరిజినాలిటీని చెడగొట్టడం ఎందుకని, ఉన్నది ఉన్నట్టుగా తీశారు. అదే ఇప్పుడు వీళ్లకు శాపంగా మారింది. ఎందుకంటే, వీళ్లు ఏ టర్కీ సినిమానైతే రీమేక్ చేశారో.. ఆ సినిమా స్ఫూర్తితో తెలుగులో చాలా సినిమాలొచ్చాయి. చాలా సీన్లు కూడా కాపీ కొట్టేశారు.

అందుకే ఇద్దరిలోకం ఒకటే సినిమా ఆల్రెడీ చూసేసిన ఫీలింగ్ కలిగిస్తుంది. ఉన్నంతలో ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ మాత్రం ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవుతాడనుకున్న రాజ్ తరుణ్ కు మరోసారి బ్యాడ్ లక్ ఎదురైంది.

Tags:    
Advertisement

Similar News