రిటైర్మెంట్ ఆలోచనలో లియాండర్ పేస్
2020 సీజన్ తో టెన్నిస్ కు గుడ్ బై భారత టెన్నిస్ మేరునగధీరుడు, పోరాటయోధుడు లియాండర్ పేస్ తన సుదీర్ఘ కెరియర్ కు ముగింపు పలకాలని నిర్ణయించాడు. తన రిటైర్మెంట్ కు ముహూర్తాన్ని సైతం నిర్ణయించాడు. 13 సంవత్సరాల చిరుప్రాయంలో తన టెన్నిస్ జీవితాన్ని ప్రారంభించిన 46 సంవత్సరాల పేస్ 2020 సీజన్ తో తాను టెన్నిస్ నుంచి రిటైర్ కావాలని నిర్ణయించినట్లు ప్రకటించాడు. తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, ఇద్దరు సోదరీమణులు, కుమార్తె ఆయానా ప్రేరణతోనే తాను సుదూర […]
- 2020 సీజన్ తో టెన్నిస్ కు గుడ్ బై
భారత టెన్నిస్ మేరునగధీరుడు, పోరాటయోధుడు లియాండర్ పేస్ తన సుదీర్ఘ కెరియర్ కు ముగింపు పలకాలని నిర్ణయించాడు. తన రిటైర్మెంట్ కు ముహూర్తాన్ని సైతం నిర్ణయించాడు. 13 సంవత్సరాల చిరుప్రాయంలో తన టెన్నిస్ జీవితాన్ని ప్రారంభించిన 46 సంవత్సరాల పేస్ 2020 సీజన్ తో తాను టెన్నిస్ నుంచి రిటైర్ కావాలని నిర్ణయించినట్లు ప్రకటించాడు.
తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, ఇద్దరు సోదరీమణులు, కుమార్తె ఆయానా ప్రేరణతోనే తాను సుదూర టెన్నిస్ ప్రయాణం చేయగలిగానని.. ప్రొఫెషనల్ గా తన టెన్నిస్ కెరియర్ లో 2020 సీజనే ఆఖరి సీజన్ అని తెలిపాడు.
కొన్ని ఎంపికచేసిన టోర్నీలలో మాత్రమే పాల్గొనాలని నిర్ణయించాడు. గత 19 సంవత్సరాలలో తొలిసారిగా డబుల్స్ మొదటి వంద ర్యాంకుల్లో చోటు కోల్పోయిన లియాండర్ పేస్ కు…డేవిస్ కప్ టెన్నిస్ చరిత్రలోనే అత్యధికంగా 44 విజయాలు సాధించిన ప్రపంచ రికార్డు ఉంది.
అంతేకాదు..రికార్డు స్థాయిలో 18 గ్రాండ్ స్లామ్ మిక్సిడ్ డబుల్స్, డబుల్స్ ట్రోఫీలు సాధించిన ఘనత లియాండర్ పేస్ కు మాత్రమే సొంతం. మరి 2020 సీజన్ ను లియాండర్ పేస్ ఎంత గొప్పగా, ఘనంగా ముగిస్తాడో మరి.