కటక్ లో కొహ్లీకి వీరాభిమాని
కొహ్లీ టాటూలతో శరీరాన్ని కాన్ వాస్ గా మార్చిన పింటూ మాస్టర్ సచిన్ టెండుల్కర్, జార్ఖండ్ డైనమైట్ మహేంద్రసింగ్ ధోనీ లాంటి స్టార్ క్రికెటర్ల వీరాభిమానులు, వారి వింత చేష్టల సంగతి మనకు తెలుసు. అయితే..భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ విరాభిమాని మాత్రం నేటితరం ట్రెండుకు తగ్గట్టుగా తన శరీరంపై టాటూలు వేయించుకోడం ద్వారా తన అభిమానాన్ని చాటుకొంటూ వస్తున్నాడు. ఒరిస్సాలోని కటక్ కు చెందిన పింటూ బెహ్రా అనే యువకుడికి విరాట్ కొహ్లీ అన్నా, అతని ఆటతీరు, […]
- కొహ్లీ టాటూలతో శరీరాన్ని కాన్ వాస్ గా మార్చిన పింటూ
మాస్టర్ సచిన్ టెండుల్కర్, జార్ఖండ్ డైనమైట్ మహేంద్రసింగ్ ధోనీ లాంటి స్టార్ క్రికెటర్ల వీరాభిమానులు, వారి వింత చేష్టల సంగతి మనకు తెలుసు. అయితే..భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ విరాభిమాని మాత్రం నేటితరం ట్రెండుకు తగ్గట్టుగా తన శరీరంపై టాటూలు వేయించుకోడం ద్వారా తన అభిమానాన్ని చాటుకొంటూ వస్తున్నాడు.
ఒరిస్సాలోని కటక్ కు చెందిన పింటూ బెహ్రా అనే యువకుడికి విరాట్ కొహ్లీ అన్నా, అతని ఆటతీరు, స్టయిల్ అన్నా చచ్చేంత ఇష్టం. భారత్ లో విరాట్ కొహ్లీ ఆడే మ్యాచ్ లు ఎక్కడ జరిగినా వెళ్లి చూడటం పింటూకు ఓ అలవాటుగా మారింది.
అంతేకాదు…విరాట్ కొహ్లీకి తన శరీరం పై రకరకాల టాటూలు వేయించుకోడం ఇష్టమని, ఓ హాబీ అని తెలుసుకొన్న పింటూ…తాను సైతం అదే అలవాటుగా మార్చుకొన్నాడు.
టాటూల కోసమే లక్ష రూపాయలు
పింటూ బెహ్రా కండలు తిరిగిన తన శరీరాన్నే…విరాట్ కొహ్లీ టాటూల కోసం కాన్ వాస్ గా మార్చాడు. ఒకటి కాదు రెండు కాదు…ఏకంగా 16 టాటూలు వేయించుకొన్నాడు.
విరాట్ కు సంబంధించిన వివిధ అంశాలతో కూడిన ఈ టాటూలు తన శరీరంపై పెర్మినెంట్ గా ఉంచుకోడం కోసం ఏకంగా లక్ష రూపాయలు ఖర్చు చేశాడు.
2016 నుంచి తన అభిమాన క్రికెటర్ కొహ్లీని స్వయంగా కలుసుకోవాలని పింటూ కలలు కంటూ వచ్చాడు.
అయితే…విశాఖ వేదికగా సౌతాఫ్రికాతో ముగిసిన టెస్ట్ మ్యాచ్ సమయంలో తన అభిమాని పింటూ బెహ్రా గురించి తెలుసుకొన్న కొహ్లీ వచ్చి స్వయంగా కలుసుకొని.. ఆప్యాయంగా మాట్లాడాడు.
టాటూలు వేయించుకోడానికి తన దగ్గర డబ్బు లేకపోడంతో..కొద్ది సంవత్సరాలుగా కష్టపడి సంపాదించిన మొత్తంలో కొంత పొదుపు చేస్తూ వచ్చానని.. అలా పొదుపు చేసిన లక్ష రూపాయలను వినియోగించానని తెలిపాడు.
విదేశీ సిరీస్ ల్లో కొహ్లీ బ్యాటింగ్ చేస్తుంటే తనకు చూడాలని ఉందని…అయితే తనకు అంత ఆర్థికస్థోమత లేదని వాపోయాడు. అదృష్టం కలసి వస్తే…విదేశీ గడ్డపై విరాట్ కొహ్లీ ఆడే మ్యాచ్ లకు సైతం హాజరై చూసే రోజు వస్తుందన్న ఆశాభావంతో ఉన్నాడు.
క్రికెట్ అభిమానుల పిచ్చి పిచ్చి…రకరకాల పిచ్చికి ఇదో తాజా ఉదాహరణ మాత్రమే. పింటూ బెహ్రా లాంటి పిచ్చి అభిమానులకు క్రికెట్ కుబేరుడు విరాట్ కొహ్లీ.. ఎన్ని లక్షల రూపాయలు ఆర్థికసహాయం చేసినా అది తక్కువే అనడంలో ఏమాత్రం సందేహం లేదు.