విండీస్ ప్రత్యర్థిగా 17 ఏళ్లుగా ఓటమిలేని భారత్

స్వదేశీ వన్డే, టీ-20 సిరీస్ ల్లో భారత్ జోరు ప్రపంచ మాజీ నంబర్ వన్, ప్రస్తుత టీ-20 విశ్వవిజేత వెస్టిండీస్ ప్రత్యర్థిగా స్వదేశీ వన్డే, టీ-20 సిరీస్ ల్లో గత 17 ఏళ్లుగా భారత్ కు అజేయరికార్డే ఉంది.  ప్రస్తుత తీన్మార్ వన్డే సిరీస్ ను సైతం నెగ్గడం ద్వారా ఆ రికార్డును కాపాడుకోవాలన్న పట్టుదలతో భారత్ ఉంది. 2002 లో భా్రత్ ప్రత్యర్థిగా… భారత గడ్డపై జరిగిన ద్వైపాక్షిక సిరీస్ ను చివరిసారిగా నెగ్గిన రికార్డు […]

Advertisement
Update:2019-12-22 06:56 IST
  • స్వదేశీ వన్డే, టీ-20 సిరీస్ ల్లో భారత్ జోరు

ప్రపంచ మాజీ నంబర్ వన్, ప్రస్తుత టీ-20 విశ్వవిజేత వెస్టిండీస్ ప్రత్యర్థిగా స్వదేశీ వన్డే, టీ-20 సిరీస్ ల్లో గత 17 ఏళ్లుగా భారత్ కు అజేయరికార్డే ఉంది.

ప్రస్తుత తీన్మార్ వన్డే సిరీస్ ను సైతం నెగ్గడం ద్వారా ఆ రికార్డును కాపాడుకోవాలన్న పట్టుదలతో భారత్ ఉంది.
2002 లో భా్రత్ ప్రత్యర్థిగా… భారత గడ్డపై జరిగిన ద్వైపాక్షిక సిరీస్ ను చివరిసారిగా నెగ్గిన రికార్డు కరీబియన్ జట్టుకు ఉంది. ఆ తర్వాత నుంచి గత 17 సంవత్సరాలుగా భారత్ వేదికగా జరిగిన వన్డే, టీ-20 సిరీస్ ల్లో కరీబియన్ టీమ్ కు వరుస పరాజయాలు తప్పడం లేదు.

2003 నుంచి 2018 వరకూ భారత గడ్డపై విండీస్ ప్రత్యర్థిగా భారత్ వరుసగా తొమ్మిది ద్వైపాక్షిక సిరీస్ లు నెగ్గిన రికార్డు ఉంది. ప్రస్తుత 2019 సిరీస్ లో భాగంగా.. టీ-20 సిరీస్ ను 2-1తో నెగ్గిన భారత్ …వన్డే సిరీస్ ను సైతం 2-1తో కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది. వరుసగా పదోసిరీస్ నెగ్గడం ద్వారా అజేయరికార్డును కాపాడుకోవాలని భావిస్తోంది.

కటక్ వన్డేలో భారత్ నెగ్గి తన ఆధిపత్యాన్ని చాటుకొంటుందో లేక…కరీబియన్ జట్టు సంచలన విజయం సాధించడం ద్వారా గత 17 సంవత్సరాల పరాజయాల రికార్డుకు ముగింపు పలుకుతుందో వేచిచూడాల్సిందే.

Tags:    
Advertisement

Similar News