నిర్మలా సీతారామన్ కు షాకుల మీద షాకులు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముందస్తు బడ్జెట్ ప్రతిపాదనలు, చర్చల్లో షాకుల మీద షాకులు తగులుతున్నాయి. మొన్నటికి మొన్న రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో భేటీలో తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు సహా వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు జీఎస్టీ పరిహారం ఇవ్వకుండా నిధులు విడుదలలో జాప్యం చేస్తున్న కేంద్రం వైఖరిని నిర్మలా సీతారామన్ ముందే కడిగేశారు. తాజాగా దేశంలోని పరిశ్రమ వర్గాలతో భేటిలోనూ ఇదే అనుభవం కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలకు ఎదురైందట. ఈ […]

Advertisement
Update:2019-12-20 06:48 IST

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముందస్తు బడ్జెట్ ప్రతిపాదనలు, చర్చల్లో షాకుల మీద షాకులు తగులుతున్నాయి. మొన్నటికి మొన్న రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో భేటీలో తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు సహా వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు జీఎస్టీ పరిహారం ఇవ్వకుండా నిధులు విడుదలలో జాప్యం చేస్తున్న కేంద్రం వైఖరిని నిర్మలా సీతారామన్ ముందే కడిగేశారు.

తాజాగా దేశంలోని పరిశ్రమ వర్గాలతో భేటిలోనూ ఇదే అనుభవం కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలకు ఎదురైందట. ఈ భేటికి స్వయంగా హాజరైన భారతీ ఎయిర్ టైల్ చైర్మన్ సునీల్ మిట్టల్, సీఐఐ అధ్యక్షుడు విక్రమ్ కిర్లోస్కర్, అసోచామ్ అధ్యక్షుడు బాలక్రిష్ణ గోయెంకా, ఫిక్కీ అధ్యక్షుడు సందీప్ సోమానీ తదితరులు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పురోగతికి చర్యలు తీసుకోవాలని.. వ్యాపార, పారిశ్రామిక రంగాలకు మరింత స్వేచ్ఛ నివ్వాలని కాస్త గట్టిగానే నిర్మలకు తేల్చిచెప్పినట్టు తెలిసింది.

దేశీయ టెలికాం రంగంలో జియో దూకుడుతో అందరూ నష్టపోతున్నారని.. దీన్ని కాపాడేందుకే తాను కేంద్ర ఆర్థిక మంత్రితో భేటి అయ్యామని ఎయిర్ టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ తెలిపారు.

ఇలా కేంద్ర ఆర్థిక బడ్జెట్ ముందస్తు కసరత్తులో ఆర్థిక మంత్రి నిర్మలకు వివిధ వర్గాల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. కేంద్రం తప్పుడు నిర్ణయాల వల్లే ఈ పరిస్థితి దాపురించిందని వారంతా ముఖం ముందే చెప్పేస్తుండడం హాట్ టాపిక్ గా మారుతోంది.

Tags:    
Advertisement

Similar News