స్పిన్ జాదూ చావ్లాకు 6 కోట్ల 50 లక్షలు

కోల్ కతా నుంచి చెన్నై గూటికి పియూష్ ఐపీఎల్- 2020 వేలంలో అత్యధిక ధర దక్కించుకొన్న భారత మాజీ క్రికెటర్ గా పియూష్ చావ్లా నిలిచాడు. గత సీజన్ వరకూ కోల్ కతా ఫ్రాంచైజీ తరపున ఆడిన పియూష్ ను చెన్నై ఫ్రాంచైజీ రికార్డు ధరకు సొంతం చేసుకొంది. కోల్ కతా లో ముగిసిన వేలంలో పియూష్ ను 6 కోట్ల 50 లక్షల రూపాయల ధరకు చెన్నై దక్కించుకొంది. అంతేకాదు … ఇంగ్లండ్ యువఆల్ రౌండర్ సామ్ కరెన్ […]

Advertisement
Update:2019-12-20 06:45 IST
  • కోల్ కతా నుంచి చెన్నై గూటికి పియూష్

ఐపీఎల్- 2020 వేలంలో అత్యధిక ధర దక్కించుకొన్న భారత మాజీ క్రికెటర్ గా పియూష్ చావ్లా నిలిచాడు. గత సీజన్ వరకూ కోల్ కతా ఫ్రాంచైజీ తరపున ఆడిన పియూష్ ను చెన్నై ఫ్రాంచైజీ రికార్డు ధరకు సొంతం చేసుకొంది.

కోల్ కతా లో ముగిసిన వేలంలో పియూష్ ను 6 కోట్ల 50 లక్షల రూపాయల ధరకు చెన్నై దక్కించుకొంది. అంతేకాదు … ఇంగ్లండ్ యువఆల్ రౌండర్ సామ్ కరెన్ ను 5 కోట్ల 50 లక్షల రూపాయల ధరకు చెన్నై ఫ్రాంచైజీనే ఖాయం చేసుకోగలిగింది.

చెన్నై చెపాక్ వికెట్ స్లోబౌలర్లకు అనువుగా ఉంటుందని, చెన్నై వికెట్ కు తగ్గ స్పిన్నర్ చావ్లా మాత్రమేనని. పైగా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో చావ్లాకు చక్కటి అవగాహన, సమన్వయం ఉన్నాయని సూపర్ కింగ్స్ టీమ్ మేనేజర్ స్టీఫెన్ ఫ్లెమింగ్ చెప్పాడు.

తాము కనీస బడ్జెట్ తో వేలంలో పాల్గొన్నామని, యాండీ కమిన్స్ లాంటి బౌలర్ ను దక్కించుకోవాలని భావించినా…. అందుబాటులో ఉన్న బడ్జెట్ లోనే అవసరమైన ఆటగాళ్లను ఎంచుకోవాల్సి వచ్చిందని వివరించాడు.

గత సీజన్లో రన్నరప్ స్థానం సాధించిన చెన్నై జట్టులోఅంబటి రాయుడు, సురేశ్ రైనా, రవీంద్ర జడేజా, డూప్లెసిస్, కేదార్ జాదవ్, డ్వయన్ బ్రావో, ఇమ్రాన్ తాహీర్, మిషెల్ సాంట్నర్, దీపక్ చహార్, లుంగీఎన్ గిడీ, జోష్ హేజిల్ వుడ్, శార్దూల్ ఠాకూర్ లాంటి మేటి ఆటగాళ్లున్నారు.

తమ జట్టు అత్యంత సమతూకంతో ఉండడం పట్ల ఫ్లెమింగ్ సంతృప్తి వ్యక్తం చేశాడు.

Tags:    
Advertisement

Similar News