అసెంబ్లీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్... కారణం ఇదే..

అసెంబ్లీలో రాజధాని భూకుంభకోణంపై హాట్‌హాట్‌గా చర్చ సాగింది. చర్చకు సమాధానం ఇచ్చిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి  రాజధానిలో అక్రమాలను వరుసగా వివరించారు. రాజధాని ఎక్కడ వస్తుందో ముందే తెలుసుకుని ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ ద్వారా భూములు కొన్న టీడీపీ నేతల పేర్లు చదివి వినిపించారు. టీడీపీ నేతల భూములకు సంబంధించిన మ్యాప్‌లను కూడా అసెంబ్లీలో ప్రదర్శించారు. దళితుల నుంచి అసైన్డ్ భూములు లాక్కున్న టీడీపీ నేతల పేర్లను బుగ్గన చదవడం మొదలుపెట్టడంతో టీడీపీ సభ్యులు స్పీకర్ […]

Advertisement
Update:2019-12-17 14:30 IST

అసెంబ్లీలో రాజధాని భూకుంభకోణంపై హాట్‌హాట్‌గా చర్చ సాగింది. చర్చకు సమాధానం ఇచ్చిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాజధానిలో అక్రమాలను వరుసగా వివరించారు. రాజధాని ఎక్కడ వస్తుందో ముందే తెలుసుకుని ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ ద్వారా భూములు కొన్న టీడీపీ నేతల పేర్లు చదివి వినిపించారు. టీడీపీ నేతల భూములకు సంబంధించిన మ్యాప్‌లను కూడా అసెంబ్లీలో ప్రదర్శించారు.

దళితుల నుంచి అసైన్డ్ భూములు లాక్కున్న టీడీపీ నేతల పేర్లను బుగ్గన చదవడం మొదలుపెట్టడంతో టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. బుగ్గన చదువుతున్న పేర్లు వినిపించకుండా గట్టిగా కేకలు వేశారు. దాంతో జోక్యం చేసుకున్న ముఖ్యమంత్రి… కావాలనే మంత్రి ప్రసంగం ప్రజలకు వినిపించకూడదన్న ఉద్దేశంతోనే టీడీపీ సభ్యులు గొడవ చేస్తున్నారని… వారిని సభ నుంచి బయటకు పంపించి వాస్తవాలు ప్రజలకు తెలియజేసేందుకు అవకాశం కల్పించాలని కోరారు.

అసెంబ్లీ వ్యవహారాలశాఖ మంత్రి బుగ్గన తొమ్మిది మంది టీడీపీ సభ్యుల పేర్లు చదివి తీర్మానం ప్రవేశపెట్టగా వారిని స్పీకర్ తమ్మినేని సీతారాం సభ నుంచి సస్పెండ్ చేశారు.

Tags:    
Advertisement

Similar News