పెరిగిన విజయపాల ధర...

విజయ పాల ధరలు పెరిగాయి. సోమవారం నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. లీటర్‌ పాలపై రెండు రూపాయలు పెంచుతున్నట్లు తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం టోన్డ్ మిల్క్ లీటర్ ధర రూ.42 కాగా, పెరిగిన ధరతో అది రూ. 44కు చేరుకోనున్నది. అయితే.. స్టాండెడ్ మిల్క్ మ‌రియు ఇతర పాల ధ‌ర‌ల‌లో ఎటువంటి మార్పు లేద‌ని ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఇటు అమూల్‌, మదర్‌ డెయిరీ కూడా పాలధరలను పెంచింది. […]

Advertisement
Update:2019-12-16 04:22 IST

విజయ పాల ధరలు పెరిగాయి. సోమవారం నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. లీటర్‌ పాలపై రెండు రూపాయలు పెంచుతున్నట్లు తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సంస్థ ప్రకటించింది.

ప్రస్తుతం టోన్డ్ మిల్క్ లీటర్ ధర రూ.42 కాగా, పెరిగిన ధరతో అది రూ. 44కు చేరుకోనున్నది. అయితే.. స్టాండెడ్ మిల్క్ మ‌రియు ఇతర పాల ధ‌ర‌ల‌లో ఎటువంటి మార్పు లేద‌ని ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

ఇటు అమూల్‌, మదర్‌ డెయిరీ కూడా పాలధరలను పెంచింది. మదర్‌ డెయిరీ లీటర్‌కు మూడు రూపాయలు పెంచింది.

అమూల్‌ మాత్రం లీటర్‌కు రెండు రూపాయలు పెంచినట్లు ఓ ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీ, పశ్చిమబెంగాల్‌, ముంబై, మహారాష్ట్రలో ఈ కొత్త ధరలు ఆదివారం నుంచి అమల్లోకి వచ్చాయి.

Tags:    
Advertisement

Similar News